పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం…ప్రియుడుకోసం అతని రెండో భార్యను చంపిన ప్రియురాలు?

దేశంలో రోజురోజుకీ వివాహేతర సంబంధాల సంఖ్య పెరుగుతూనే ఉంది. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుకుపోయి సంసారం చేయకుండా ఇతరుల మోజులో పడి వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. పెళ్లి అయ్యిందన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా భార్యాభర్తలను మోసం చేస్తూ ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకుంటున్నారు. ఈ వివాహేతర సంబంధాల వల్ల ప్రతిరోజు ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఎంతోమంది హత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఇటీవల పెళ్లయిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ అతనికోసం అతని రెండో భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన మధ్యప్రదేశ్ లో కలకలం రేపింది.

వివరాలలోకి వెళితే…దేవాస్ జిల్లాకు చెందిన బబ్లూకి 14 సంవత్సరాల క్రితం నీలం అనే యువతితో పెళ్లి జరిగింది. వీరికీ ముగ్గురు పిల్లలున్నారు. అయితే బబ్లూ తన భార్యకు తెలియకుండా ఈ యేడాది మే నెలలో రాణి అనే మరో యువతిని రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి పెళ్ళి సంగతి రెండో భార్యకు తెలియకుండా దాచాడు. అయితే, బబ్లూ ప్రవర్తనలో మార్పును గమనించిన అతని మొదటి భార్య అతడిని నిలదీసింది. మొదటి పెళ్లి సంగతి తెలిసి రెండవ భార్య కూడా బబ్లుని నిలదీసింది. పెళ్లి విషయం తెలిసి.. వీరిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.

ఇది ఇలా నడుస్తుండగా.. కొంతకాలం క్రితం బంగారం కొనేందుకు వెళ్లగా బబ్లూకి అక్కడ రీతూ గౌర్ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి వీరి పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. రీతూ గౌర్ కు వివాహం అయి ఓ పాప కూడా ఉంది. రీతు గౌడ్ తో వివాహేత సంబంధం పెట్టుకున్న బబ్లు తరచూ వద్దకు వెళ్లేవాడు. ఈ క్రమంలో తన రెండో భార్యతో జరిగే గొడవల గురించి బబ్లు రీతు గౌడ్ కి వివరించాడు. రెండో భార్యతో పోరు పడలేకపోతున్నానని బబ్లు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రియుడి బాధని అర్థం చేసుకున్న రీతు ఎలాగైనా తన ప్రియుడికి ఆ సమస్యల నుండి విముక్తి కలిగించాలని ఆలోచించింది. బబ్లూతో కలిసి బబ్లు రెండో భార్యని హత్య చేయటానికి పథకం వేసింది.

ఈ క్రమంలో బ్లౌజ్ కుట్టించుకోవాలని నెపంతో వేరే మహిళతో కలిసి బబ్లు రెండవ భార్య ఇంటికి వెళ్ళింది. అక్కడ ఆ మహిళతో కలిసి బబ్లు రెండవ భార్యని గొంతు నలిమి హత్య చేసి ఏమి ఎరగనట్టు అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొంత సమయం తర్వాత అక్కడికి చేరుకున్న బబ్లు తనకు ఏమీ తెలియనట్లు ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించగా ఆమె హత్య చేయబడినట్లు పోస్టుమార్టంలో వెల్లడయింది. దీంతో పోలీసులు బబ్లూ ని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయట పెట్టాడు. తన ప్రియురాలితో కలిసి తానే తన భార్యను హత్య చేసినట్లు నేరం అంగీకరించాడు. దీంతో పోలీసులు బబ్లు, తన ప్రియురాలితో పాటు మరొక మహిళను కూడా అరెస్టు చేసే రిమాండ్ కి తరలించారు.