Pushpa OTT : ఇండస్ట్రీ టాక్ : “పుష్ప” కి అమేజాన్ అంత ధర ఇచ్చిందా.?

Pushpa OTT :  టాలీవుడ్ ఐకాన్ స్టార్ గా మారిపోయిన అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ భారీ సినిమా పుష్ప పార్ట్ 1. తన దర్శకుడు సుకుమార్ తో తెరకెక్కించిన ఈ హ్యాట్రిక్ బొమ్మ బాక్సాఫీస్ దగ్గర ఇంకా దంచి కొడుతుంది. అయితే ఊహించని విధంగా ఈ చిత్రం ఇంకా థియేటర్స్ లోనే ఉన్నా అనుకున్నా ఒప్పందం ప్రకారం ఈ జనవరి 7 నుంచే స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ విడియోలోకి రావడానికి రెడీ అయ్యింది.

ఒక్క హిందీ మినహా అన్ని భాషల్లో కూడా స్ట్రీమ్ కాబోతున్న ఈ సినిమాపై లేటెస్ట్ గా ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర టాక్ మొదలైంది. ఈ సినిమాకి గాను అమేజాన్ ప్రైమ్ వీడియో వారు భారీ మొత్తంలోనే ముట్టజెప్పారట. మరి ఇది అన్ని భాషల్లో కలిపి ఏకంగా 25 కోట్లు అని తెలుస్తుంది. థియేటర్స్ లో రిలీజ్ అయ్యి కొన్ని రోజుల్లోనే రావడంతో ఈ మొత్తాన్ని వారు చెల్లించినట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతానికి అయితే ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం చాలా మందే ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా సమంతా హాట్ సాంగ్ చేసింది. మరి అలానే అనసూయ, సునీల్ మరియు ఫహద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.