Pushpa Part 2 : ఇన్సైడ్ టాక్ : ఐకాన్ స్టార్ “పుష్ప 2” కి అప్పుడే భారీ ఆఫర్స్ వారి నుంచి వస్తున్నాయట.!

 Pushpa Part 2 :గత ఏడాది టాలీవుడ్ మరియు పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ హిట్ గా నిలిచిన చిత్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా “సినిమా పుష్ప పార్ట్ 1”. అల్లు అర్జున్ మరో హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తో చేసిన ఈ మొదటి పాన్ ఇండియా ప్రయత్నం భారీ హిట్ గా నిలిచి అల్లు అర్జున్ కెరీర్ లో మరో మైలు రాయిగా నిలిచింది.
అయితే పార్ట్ 1 సక్సెస్ తో ఇప్పుడు పాన్ ఇండియా వీక్షకులు ఈ సినిమా సీక్వెల్ పుష్ప ది రూల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా ఇంకా షూటింగ్ మొదలు కాకముందే ఆసక్తికరమైన ఇన్సైడ్ టాక్ ఈ సినిమా పై వినిపిస్తోంది. అటు థియేట్రికల్ మరియు ఇటు డిజిటల్ శాటిలైట్ హక్కులకు ఇప్పుడే పుష్ప బృందానికి భారీ ఆఫర్స్ వస్తున్నాయట.
ముఖ్యంగా ఐతే హిందీలో వెర్షన్ కి భారీ మొత్తంలో ఆఫర్స్ అందిస్తున్నారట. అసలు ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ కాని ఈ సినిమాకి అప్పుడే ఇంత డిమాండ్ నెలకొనడం  ఆసక్తిగా మారింది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. మరి ఈ భారీ సినిమా ఈ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవ్వనుంది అని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా ఫహాద్ ఫాజిల్, సునీల్ అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.