మెగాస్టార్ “గాడ్ ఫాథర్” కి అప్పుడే రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిపోయిందా?

టాలీవుడ్ ఆల్ టైం అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా సినిమా “గాడ్ ఫాథర్”. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మళయాళ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం లూసిఫర్ కి రీమేక్ గా చేస్తున్నారు. మరి మెగాస్టార్ రీసెంట్ గానే చిన్న బ్రేక్ ఇచ్చి మళ్లీ రీస్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ భారీ సినిమాపైనే ఇప్పుడు ఆసక్తికరమైన టాక్ స్టార్ట్ అయ్యింది.

ఆల్రెడీ ఈ సినిమాకి మెగాస్టార్ మరియు సినిమా యూనిట్ ఓ టైటిల్ ని ఫిక్స్ చేసేసారట. వచ్చే ఏడాది మే 12న ఈ సినిమా రిలీస్ చెయ్యాలని వారంతా ఫిక్స్ అయ్యారట. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. హీరోయిన్ ఇతర అంశాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.