అనూ ఇమ్మాన్యుయేల్‌తో అల్లు శిరీష్ రొమాంటిక్ టచ్ ఇంకోస్సారి.!

హమ్మయ్యా.! ఎలాగోలా తన సినిమాని హిట్టనిపించేసుకున్నాడు అల్లువారబ్బాయ్. హిట్టు లిస్టులో తన సినిమాని పడేసేందుకు భారీ మొత్తంలోనే ఖర్చు చేసేశాడు కూడా. ఫ్యామిలీ ప్రమోషన్ల పుణ్యమా అని సినిమాని సూపర్ హిట్ లిస్టులో పడేసుకున్నాడు. అదేనండీ అల్లు శిరీష్ నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా గురించే మనం మాట్లాడుకుంటున్నాం. రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాని సూపర్ హిట్ అనేశారు కదా. సహజీవనం కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమాని ఎలాగోలా యూత్‌కి బలవంతంగా కనెక్ట్ చేసేసి అబ్బో.! సూపర్ హిట్ అనిపించేశారు.

అల్లు అర్జున్ స్వయంగా రంగంలోకి దూకేసి, తన తమ్ముడు సూపర్ హిట్టు.. బంపర్ హిట్టు.. అంటూ రొమాంటిక్ హీరో ట్యాగ్ కూడా కట్టబెట్టేశాడు. అలా మెత్తానికి అల్లు శిరీష్ సక్సెస్ అయిపోయాడు. ఇదే జోష్‌లో మరో సినిమానీ అల్లు శిరీష్ కోసం సెట్ చేసి పెట్టేశారట ఇటు అన్న అల్లు అర్జున్, అటు నాన్న అల్లు అరవింద్.ఓ యంగ్ డైరెక్టర్ తీసుకొచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీతో హిట్ కాంబినేషన్ అని పేరు తెచ్చుకున్న అనూ ఇమ్మాన్యుయేల్, అల్లు శిరీష్ కాంబినేషన్‌లోనే ఈ సినిమా పట్టాలెక్కనుందట. మిగిలిన వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయనీ తెలుస్తోంది.