ఫ్యామిలీతో దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్న బ‌న్నీ.. వైర‌ల్‌గా మారిన ఫొటోలు, వీడియోలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ ప‌ర్సన్ అనే విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. కాస్త టైం దొరికితే పిల్ల‌ల‌తో స‌ర‌దాగా గ‌డ‌పడం, లేదంటే ఫ్యామిలీతో క‌లిసి విహార యాత్ర‌ల‌కు వెళ్ల‌డం చేస్తుంటారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఇంటికే ప‌రిమితం కావాల్సి రావ‌డంతో అల్లు అర్జున్ చిన్న పిల్లాడిలా మారి అయాన్, అర్హ‌ల‌తో స‌ర‌దాగా ఆడుకున్నాడు. ఆ సంద‌డికి సంబంధించిన ఫొటోల‌ను స్నేహా రెడ్డి త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, ఫుల్ వైర‌ల్ అయ్యాయి. అయితే క‌రోనా వ‌ల‌న దాదాపు ఎనిమిది ఇంటికే ప‌రిమితం కావ‌ల్సి రావ‌డం, ఆ త‌ర్వాత బ‌న్నీ పుష్ప షూటింగ్ మొద‌లు కావ‌డంతో ఎక్క‌డికి వెళ్లే ఛాన్స్ రాలేదు.

పుష్ప సినిమా షూటింగ్‌కు లాంగ్ బ్రేక్ రావ‌డంతో అల్లు అర్జున్ దుబాయ్ టూర్ వేశాడు. అక్క‌డ ఫేమ‌స్ థీమ్ పార్క్‌ను సంద‌ర్శించి కొన్ని ఫొటోలు దిగారు. అనంత‌రం చిల్డ్ర‌న్స్ ప్లే మ్యూజియం ఎయిర్ గ్యాల‌రీలో అర్హ‌, అయాన్‌ల‌ను ఆడించాడు అల్లు అర్జున్. వీటికి సంబంధించిన వీడియోను స్నేహా రెడ్డి త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇది అభిమానుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఫ్యామిలీతో బ‌న్నీ చేస్తున్న ఎంజాయ్ మెంట్‌ను చూసి అభిమానులు థ్రిల్ అవుతున్నారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ హాట్రిక్ కలయికలో వస్తోన్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఆగ‌స్ట్ 13న ఈ చిత్రం విడుద‌ల కానుండ‌గా, ఈ మూవీకి సంబంధించి విడుద‌ల‌వుతున్న ప్ర‌చార చిత్రాలు ఫ్యాన్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. పుష్ప చిత్రం త‌ర్వాత అల్లు అర్జున్ .. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. ఆ త‌ర్వాత ఐకాన్ అనే సినిమా కూడా చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.