Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఇలా పవన్ కళ్యాణ్ నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. అయితే ఈయన చేసింది చాలా తక్కువ సినిమాలో ఆయనప్పటికీ విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలకు నెగిటివ్ టాక్ వచ్చినా కూడా భారీ స్థాయిలో ఓపెనింగ్ రాబడతాయి. అయితే ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో సినిమాలను కూడా పూర్తిగా తగ్గించారు.
ఇక ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వరుస హిట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈయన కెరియర్ లో చెప్పుకోదగ్గ సినిమాలలో జానీ సినిమా కూడా ఒకటి. అప్పటివరకు ప్రేమ కథ చిత్రాలతో అపజయం ఎరుగని హీరోగా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ జానీ సినిమా విడుదల సమయంలో కూడా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాకు స్వయంగా పవన్ కళ్యాణ్ దర్శకుడిగా మారడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు.
ఈ సినిమా విడుదలైన తర్వాత ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ఒక డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమా గురించి అల్లు అరవింద్ ఇటీవల చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అల్లు అరవింద్. నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ…
పవన్ కళ్యాణ్ వరుసగా డబుల్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన తర్వాత నేను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన చిత్రం జానీ. ఈ సినిమా గురించి ఎప్పుడు తలుచుకున్న నాకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుందని తెలిపారు.పవన్ కళ్యాణ్ పీక్ టైం లో తన ఇమేజ్ ని పూర్తిగా పక్కన పెట్టి ఈ చిత్రాన్ని తీసాడు, ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక్క పెద్ద ప్రయోగమే. కానీ ఆ ప్రయోగాన్ని జనాలు ఈ చిత్రాన్ని స్వీకరించలేకపోయారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒకరోజు పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతూ ఎక్కడో తేడా కొడుతుందని సందేహం వచ్చింది అయితే అప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి కావడంతో సినిమా పూర్తి చేసి విడుదల చేశామని అనుకున్న విధంగానే ఈ సినిమా ఫ్లాప్ అయిందని అల్లు అరవింద్ తెలిపారు. ఈ సినిమా ఫ్లాప్ అయిన ఓపెనింగ్స్ భారీగా రాబట్టాయి అంటూ అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.