‘పుష్ప’ టీజర్ : ‘రంగస్థలం’ పోలికలు కనబడుతున్న హిట్ కళ ఉంది

Allu Arjun's Pushpa Raj introducing teaser is impressive

Allu Arjun's Pushpa Raj introducing teaser is impressive

ఇదిగో అదిగో అని ఊరిస్తూ వచ్చిన ‘పుష్ప’ నుండి అల్లు అర్జున్ ఇంట్రడ్యూజింగ్ టీజర్ కాసేపటి క్రితమే బయటికొచ్చింది. టీజర్ టోటల్ ఇంప్రెసివ్ గా ఉంది. అల్లు అర్జున్ అయితే నెక్స్ట్ లెవల్ అంతే. పేరుకు డీగ్లామర్ లుక్ అయినా చాలా ఇంపాక్ట్ చూపించింది. అన్ని సినిమాల్లోనూ చాలా స్టైలిష్ గా కనిపించిన బన్నీ ఇందులో పూర్తి భిన్నంగా కనిపించాడు. కాస్ట్యూమ్, హెయిర్ స్టయిల్ నుండి బాడీ లాంగ్వేజ్ వరకు అన్నీ కొత్తగానే ఉన్నాయి.

అయితే టీజర్లో సుకుమార్ గత చిత్రం ‘రంగస్థలం’ పోలికలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. చిట్టిబాబుకు వినికిడి లోపం ఉన్నట్టే ఇందులో పుష్పకు చేతి భుజం లోపం కనబడుతోంది. అదే మాస్ అప్పియరెన్స్. సినిమా పూర్తిగా అడవుల్లోనే, స్మగ్లింగ్ నేపథ్యంలోనే ఉంటుందని అనిపిస్తోంది. హీరోయిన్ రష్మిక పాత్రలో కూడ ‘రంగస్థలం’లో సమంత లుక్స్ బయటపడ్డాయి. ఇక యాక్షన్ షాట్స్ అయితే స్టన్నింగ్ అనేలా ఉన్నాయి. బన్నీ పాత్ర అయితే టోటల్ అగ్రెసివ్ గా కనబడుతోంది. టీజర్లో అల్లు అర్జున్ చెప్పింది సింగిల్ వర్డ్ డైలాగ్ అయినా బాగా పేలింది. విజువల్స్, టేకింగ్ గ్రాండ్ లెవల్లో ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం చాలా బాగా కుదిరింది. ఒక్కమాటలో చెప్పాలంటే టీజర్లో హిట్ కళ కనబడుతోంది.