Puspha Movie: ఆ ఒక్క షాట్ కోసం 12 గంటలు కష్టపడిన పుష్ప రాజ్.. అందుకే ఈ ఫలితం!

Puspha Movie: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో అల్లు అర్జున్ మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.డిసెంబర్ 17 వ తేదీ విడుదల అయిన ఈ సినిమా అన్ని భాషలలో అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం దాదాపు రెండు సంవత్సరాలుగా అదే బాడీ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ అల్లు అర్జున్ చాలా కష్టపడ్డారని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా ఈ స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కించుకోవడం వెనుక అల్లు అర్జున్ కష్టం ఎంతో దాగి ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని చిత్ర బృందం బయటపెట్టారు.ఈ సినిమాలో ఒక షార్ట్ కోసం అల్లు అర్జున్ ఏకంగా 12 గంటలు కష్టపడినట్లు చిత్రబృందం వెల్లడించారు.

పుష్ప సినిమాలో ఏ బిడ్డా…ఇది నా అడ్డా అనే పాటలో ఒక సన్నివేశాన్ని షూట్ చేయడం కోసం అల్లు అర్జున్ మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరిగి అర్ధరాత్రి రెండు గంటల వరకు కష్టపడ్డారని చిత్రబృందం తెలియజేశారు. ఈ పాటలో అల్లు అర్జున్ ఏకంగా 24 డ్రస్సులు మార్చారని తెలియజేశారు.ఇలా ఎంతో ఓర్పుతో సహనంతో కష్టపడటం వల్ల ప్రస్తుతం ఈ సినిమా మంచి ఆదరణ దక్కించుకుని విజయ పథంలో దూసుకు పోయిందనే చెప్పాలి.