Allu Arjun : ‘పుష్ప’లో ఆ రేంజ్ లో చేశాడా? బన్నీకి నేషనల్ అవార్డ్ ఖాయం అట..!

Allu Arjun : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ సినిమా “పుష్ప పార్ట్ 1”. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రమోషన్ ఇప్పుడు ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. మొన్ననే భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఒక్కో రాష్ట్రానికి చిత్ర యూనిట్ ప్రమోషన్స్ నిమిత్తం వెళుతున్నారు.

అలా ఈరోజు పుష్ప ప్రమోషన్స్ కోసం చెన్నై తరలి వెళ్లారు. అయితే ఈ ఈవెంట్ కి గాను సినిమా హీరో హీరోయిన్ రష్మికా మందన్నాతో పాటు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా వెళ్ళాడు. అయితే దేవీనే ఇప్పుడు చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ మాంచి వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్ కి ఈ సినిమాతో ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందని తాను నమ్ముతున్నానని ఈ ప్రెస్ మీట్ లో తెలిపాడు. దీనితో ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనపై మరింత ఆసక్తి నెలకొంది. మరి అల్లు అర్జున్ ఆ రేంజ్ లో పుష్ప రాజ్ గా నటించాడో లేదో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.