ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “పుష్ప ది రైజ్”. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాని అల్లు అర్జున్ చాలా ప్రిస్టేజియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియన్ మార్కెట్ లో తన ఎంట్రీ పక్కాగా ఉండాలని కోరుకుంటున్నాడు.
అందులో భాగంగానే అల్లు అర్జున్ కొన్ని కీలక జాగ్రత్తలు తీసుకోబోతున్నాడట. ఈ సినిమాకి తెలుగుతో పాటుగా హిందీ మరియు తమిళ భాషల్లో తన డబ్బింగ్ తానే చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడట. ఇది నిజంగా ఒక మంచి ప్రయత్నం అని చెప్పాలి. అల్లు అర్జున్ ఒరిజినల్ వాయిస్ లో సినిమా అనేది అక్కడి ఆడియెన్స్ లో కూడా మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. ఇవన్నీ త్వరలోనే పూర్తి కానున్నాయట. ఇక ఈ భారీ చిత్రం వచ్చే డిసెంబర్ 17న రిలీజ్ కి రెడీగా ఉంది.