“పుష్ప” లో స్టన్నింగ్ లుక్ సిద్ధం చేసిన బన్నీ..క్రేజీ అప్డేట్ మీకోసం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా చేస్తున్న బిగ్గెస్ట్ చిత్రం “పుష్ప ది రైజ్”. అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాకే కొన్ని ఊహించని చిక్కులు ఎదురు కాగా వీటితో పాటు ఓ క్రేజీ అప్డేట్ తెలుస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ చాలా ప్రత్యేకంగా కొత్తగా కనిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు లుక్ పరంగానే ఇంట్రెస్టింగ్ సమాచారం తెలుస్తోంది.

మళ్లీ చాలా ఏళ్ల తర్వాత అల్లు అర్జున్ ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ బాడీ సిద్ధం చేశాడట. పుష్ప రాజ్ గా సిక్స్ ప్యాక్ తో ప్రతి ఒక్కరినీ బన్నీ స్టన్ చెయ్యడం కన్ఫర్మ్ అని తెలుస్తోంది. దీని తాలూకా పోస్టర్ ని కూడా చిత్ర బృందం విడుదల చేసే అవకాశం కూడా ఉందట. పాన్ ఇండియా సినిమా అనే ఆలోచన తో బన్నీ చాలా కష్టపడ్డాడు మరి హిందీలో కూడా ఈ సినిమా రిలీస్ అవుతుందో లేదా వేచి చూడాల్సిందే.