‘ఎన్టీఆర్ – పులి’ ఫైట్‌ కి మించి.. అల్లు అర్జున్  సింహం’ ఫైట్ ?

రాజమౌళి RRR సినిమాలో ఎన్టీఆర్ పులి తో పోరాడే సన్నివేశం సినిమాకే హైలైట్. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ‘పుష్ప 2 ‘ కోసం ఇలాంటి ఒక సీన్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది.

ఇంటర్వెల్ సీక్వెన్స్ లో బన్నీ తన అనుచరులను కాపాడే క్రమంలో సింహంతో పోరాడాల్సి వస్తోందట. అల్లు అర్జున్‌ సింహంతో పోరాడే సీన్ సినిమాలోనే హైలైట్ గా నిలుస్తోందట. ఈ సీన్ ఎన్టీఆర్ పులి ఫైట్ కంటే హైలైట్ గా నిలుస్తుందంట.

ఈ సీన్ కోసం సుకుమార్ అండ్ టీం థాయ్‌ల్యాండ్ వెళ్లనుంది. ‘పుష్ప’ హిట్ అవ్వడంతో ‘పుష్ప 2 ‘ కి ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ లో ఒక బాలీవుడ్ హీరో ని ఒక కీ రోల్ లో నటింపచేయాలని సుకుమార్ చూస్తున్నాడని తెలుసుతుంది. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.