Allu Arjun: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గద్దర్ సినిమా వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ గద్దర్ అవార్డులలో భాగంగా ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. ఇకపోతే తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి ఈ గద్దర్ అవార్డులను ప్రకటించడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలను చాలా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎంతోమంది సినీ ప్రముఖుల సమక్షంలో రాజకీయ నాయకుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.
ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నటుడు అల్లు అర్జున్ పైనే అందరి ఫోకస్ ఉంది. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా సమయంలో సంధ్య థియేటర్ వద్దకు వెళ్లడంతో జరిగిన తొక్కిసలాట ఘటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తనని అరెస్టు చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. ఇలా ఈ అరెస్టు తర్వాత చిత్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఎన్నో విభేదాలు వచ్చాయి అయితే ఈ వివాదం తర్వాత మొదటిసారి అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డు వేడుకలలో కనిపించడంతో అందరి దృష్టి వీరిపైనే ఉంది.
ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడంతోనే అల్లు అర్జున్ తనని హగ్ చేసుకుని మరి పలకరించారు అదేవిధంగా ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కు స్వయంగా రేవంత్ రెడ్డి తన చేతుల మీదుగా అవార్డును బహకరించడమే కాకుండా వేదికపైనే పుష్ప2 డైలాగ్ చెబుతూ సందడి చేశారు. అయితే ఈ కార్యక్రమం ప్రారంభంలోనే తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ అవార్డు ప్రధానోత్సవంలో భాగంగా ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అలాగే ఎన్టీఆర్ నేషనల్ అవార్డు పురస్కారానికి బాలకృష్ణను స్వయంగా రేవంత్ రెడ్డి ఎంపిక చేశారని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అప్పట్లో అరెస్టులు చేయించి ఇప్పుడు బన్నీను కూల్ చేసే ప్రయత్నంలో భాగంగానే రేవంత్ రెడ్డి ఇలా అల్లు అర్జున్ ని ఎంపిక చేశారా అంటూ పలువురు ఈ విషయంపై కామెంట్లు చేస్తున్నారు.