బన్నీ సినిమా మళ్ళీ వాయిదా? ఆ డేట్ కి రాబోతున్న..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (బన్నీ) కి ఇప్పుడు పరిస్థితులు అన్నీ ఒక్కసారిగా అడ్డం తిరిగినట్టు అయ్యిందని చెప్పాలి. ఓ పక్క తన సినిమా ఆగిపోవడం కాకుండా మరోపక్క ఎంతో కష్టపడుతున్న తన భారీ సినిమా “పుష్ప” చుట్టూ కూడా కాస్త నెగిటివ్ వాతావరణం నెలకొంది. ఆల్రెడీ పలు డేట్స్ నుంచి వాయిదా పడ్డ ఈ చిత్రం మళ్ళీ ఇప్పుడు వాయిదా పడినట్టుగా తెలుస్తుంది.

మామూలుగా డిసెంబర్ 17నే ఈ సినిమా రిలీజ్ ని ప్లాన్ చెయ్యగా ఇప్పుడు ఆ డేట్ కి రాదని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ డేట్ కి నందమూరి బాలకృష్ణ నటించిన భారీ చిత్రం “అఖండ” రేస్ లో ఉన్నట్టు తెలుస్తుంది. దీనిలో ఎంతమేర నిజం ఉందో కానీ ఇది నిజం కాదు అనడానికి ఆస్కారం లేదు. అందుకే ఇంకొన్ని రోజులు ఆగి చూస్తే ఈ టాక్ లో ఎంతవరకు నిజముందో అందరికీ తెలుస్తుంది.