Allu Arjun: యాట తల నరికినట్టు రప్పా..రప్పా నరుకుతా.. సీఎం రేవంత్ రెడ్డి ముందే రెచ్చిపోయిన బన్నీ?

Allu Arjun:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్ కి రావడం అక్కడ తొక్కిసలాట జరగడంతో ఒక మహిళ చనిపోయింది. ఇలా మహిళ చనిపోవడంతో అందుకు అల్లు అర్జున్ ని బాధ్యులను చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ ని అరెస్టు చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ఒకే చోట కలిసి కనిపించిన సందర్భాలు లేవు అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిలిం అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ గద్దర్ అవార్డు వేడుకలలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అదే విధంగా ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకు గద్దర్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును స్వయంగా రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకోవటం విశేషం. ఇలా అవార్డు అందుకున్న అల్లు అర్జున్ వేదికపై మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు . తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించి, నాకు ఈ అవార్డును ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని తెలంగాణ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇక ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు కారణం సుకుమార్ గారని, సుకుమార్ లేకపోతే నేను లేను అంటూ మరోసారి డైరెక్టర్ సుకుమార్ గురించి తెలిపారు. ఇక తనకొచ్చిన ఈ అవార్డును తన అభిమానులకే సొంతం చేస్తున్నానని బన్నీ తెలియచేశారు.. ఇకపోతే ఇది సినిమా వేడుక కాబట్టి సినిమా డైలాగు చెప్పొచ్చా అంటూ రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకొని మరి ఈయన వేదికపై పుష్ప 2 సినిమాలో డైలాగ్ చెప్పారు.

ఆ బిడ్డ మీద ఒక్క గీత పడినా.. గంగమ్మ తల్లి జాతరలో యాట తల నరికినట్లు రప్పా రప్పా నరుకుతా.. పుష్ప.. పుష్పరాజ్.. అస్సలు తగ్గేదే లే అంటూ అల్లు తనదైన స్టైల్ లోనే డైలాగ్ చెప్పడంతో ఒక్క సారిగా ఆడిటోరియం మొత్తం మారుమోగిపోయింది. ఇలా సీఎం రేవంత్ రెడ్డి ముందే అల్లు అర్జున్ తనదైన శైలిలోని సందడి చేశారని చెప్పాలి. ఇక ఈ వేడుకలో ఎంతోమంది సినీ సెలబ్రిటీల పాల్గొని సందడి చేశారు. ఇక రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు.