Allu Arjun: మా జీవితాలకు సుకుమార్ సరైన అర్థం తీసుకొచ్చారు…. పుష్ప3 అద్భుతం: అల్లు అర్జున్

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు అయితే ఈ సినిమా విడుదల సమయంలో రేవతి అనే అభిమాని మరణించడంతో అల్లు అర్జున్ అరెస్ట్ కావాల్సి వచ్చింది. ఇలా ఈ వివాదాలు నడుమ చిత్రబృందం ఈ సినిమా సక్సెస్ ఏమాత్రం ఎంజాయ్ చేయలేకపోయారు.

ఇకపోతే అల్లు అర్జున్ కూడా అరెస్టు తర్వాత పూర్తిగా మీడియాకు దూరంగా ఉంటున్నారు ఆయన బయటకు కూడా రావడం లేదు. ఇక ఈ సినిమాని ఇంత మంచి విజయం అందించినటువంటి అభిమానులు అలాగే ప్రేక్షకులకు చిత్ర బృందం కృతజ్ఞతలు తెలపడం కోసం ప్రత్యేకంగా థాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. అరెస్టు తర్వాత అల్లు అర్జున్ మొదటిసారి ఈ కార్యక్రమంలో కనిపించారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ అయ్యింది అంటే అందుకు కారణం దర్శకుడు సుకుమార్ గారేనని ఈ క్రెడిట్ మొత్తం ఆయనకే చెందుతుంది అంటూ మాట్లాడారు నటీనటులు ఎంత అద్భుతంగా నటించినా దర్శకుడు సరిగా చేయకపోతే సినిమా హిట్ కాదని కేవలం డైరెక్టర్ కారణంగానే సినిమాలు సక్సెస్ అవుతాయని తెలిపారు.

ఇక ఈ సినిమా కోసం వందల సంఖ్యలో ఆర్టిస్టులు పనిచేశారు ఈరోజు వారందరి జీవితాలకు ఒక అర్థం ఉంది అంటే ఆ క్రెడిట్ అంతా సుకుమార్ గారిదేనని తెలియజేశారు. ఈ సినిమాని ఇంత మంచి సక్సెస్ చేసినటువంటి ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విజయాన్ని వారికి అంకితం చేసేసారు.

ఇక అల్లు అర్జున్ పుష్ప 3 గురించి కూడా మాట్లాడుతూ ఇప్పటివరకు ఈ సినిమా కథ ఏంటి అనేది నాకు కానీ సుకుమార్ గారికి కూడా తెలియదు కానీ ఇది ఒక అద్భుతమైన ఎనర్జీని కలిగిస్తుందని తెలిపారు. మరి ఈ సినిమా ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో తెలియాల్సి ఉంది అంటూ అల్లు అర్జున్ పుష్ప 3 గురించి కూడా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.