Allu Arjun: అల్లు అర్జున్, అట్లీ మూవీలో ఛాన్స్ కొట్టేసిన బాలీవుడ్ బ్యూటీ.. ఇంతకీ ఆమె ఎవరంటే!

Allu Arjun: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 మూవీతో పాన్ ఇండియా లెవెల్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీగా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్. ఈ సినిమా విడుదల అయ్యి సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దాదాపుగా 2000 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను సృష్టించింది. అంతేకాకుండా జక్కన్న దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 లాంటి రికార్డులను సైతం బద్దలు కొట్టింది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు..

ఇకపోతే బన్నీ తన తదుపరి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారికంగా ప్రకటన రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా బన్నీ సినిమా గురించి మరొక ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ గా మారింది. అదేమిటంటే అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కంటే ముందు అట్లీతో ఒక సినిమా చేయబోతున్నాడు అనే వార్త వైరల్ గా మారింది..అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతున్న సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా గురించి ఇప్పుడు ఒక ఆసక్తికర విషయం నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుంది అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఇదే వార్త ఆ టాపిక్ గా మారింది. ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు కానీ ఒకవేళ జాన్వీ మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే అని చెప్పాలి. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ రామ్ చరణ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తోంది.