Pushpa Part 2 : వైరల్ : “పుష్ప పార్ట్ 2” లో అల్లు అర్జున్ లుక్ ఇదేనా..?

Pushpa Part 2 : ఎంత మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా పాన్ ఇండియా లెవెల్లో మాత్రం తన స్వశక్తి తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన స్టార్డం ని తెచ్చుకున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గా తెలుగు సినిమాతో పరిచయం అయ్యి ఇప్పుడు “పుష్ప” సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి రాజమౌళి తో సినిమా లేకుండా 100 కోట్ల మార్కెట్ తెచ్చుకున్న ఏకైక హీరోగా నిలబడ్డాడు.
మరి తనని ఈ రేంజ్ లో నిలబెట్టిన లేటెస్ట్ సినిమా “పుష్ప” హవా అయితే ఇంకా కొనసాగుతుంది. దీనితో ఇప్పుడు ఈ సినిమా రెండో భాగంపై భారీ స్థాయి అంచనాలు కూడా నెలకొన్నాయి.
అయితే అప్పుడెప్పుడో ఈ సినిమా యూనిట్ ఫస్ట్ లాక్ డౌన్ టైం లో అడగకుండానే అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ కి ఊహించని ట్రీట్ ఇచ్చారు.
ఇక ఇప్పుడు పార్ట్ 2 లో అల్లు అర్జున్ ఎలా ఉంటాడో తన అప్డేటెడ్ లుక్ ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా చిత్ర యూనిట్ రివీల్ చెయ్యడం వైరల్ గా మారింది. అయితే ఇందులో పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ మరికాస్త స్టైలిష్ గా కనిపిస్తున్నాడని చెప్పాలి.
అంటే తనకంటూ స్మగ్లింగ్ లో ఒక సుస్థిర స్థానం ఏర్పర్చుకున్న తర్వాత లైఫ్ ని మరింత గ్రాండ్ గా మార్చుకున్నట్టు ఆ డ్రెస్సింగ్ గాని గ్లాసెస్ తో గాని కనిపిస్తున్నాడు.
అయితే ఇది ఎలాంటి ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ చెప్పలేదు కానీ ఆ సినిమాలో అయితే ఈ రేంజ్ లో ఉంటాడని చెప్పినట్టు అనిపిస్తుంది. దీనితో ఈ కొత్త లుక్ వైరల్ అవుతుంది.
https://twitter.com/PushpaMovie/status/1512135651268841475?s=20&t=q-rafqDfYobJMZ8xUNWJnw