Allu Arjun: తండేల్ ఈవెంట్ కు డుమ్మా కొట్టిన బన్నీ… ఆ ఆ సమస్యనే ప్రధాన కారణమా?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తండేల్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నారు అంటూ చిత్ర బృందం పోస్టర్లను విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే గత రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరిగింది కానీ ఈ వేడుకలో అల్లు అర్జున్ పాల్గొనక పోవడంతో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి అసలు అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వస్తారని ఆయన తప్పకుండా తన అరెస్టు గురించి మాట్లాడుతారని అభిమానులు ఎదురు చూశారు.

ఇలా ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశ ఎదురయిందని చెప్పాలి అయితే చివరి నిమిషంలో అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి రాకపోవడానికి గల కారణం ఏంటి అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారన్న విషయం తెలియగానే పెద్ద ఎత్తున అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా చిత్ర బృందం తన నిర్ణయం మార్చుకున్నట్టు తెలుస్తోంది.

అల్లు అర్జున్ చూడటం కోసమే సంధ్య థియేటర్ వద్ద అభిమానులు ఒక్కసారిగా తరలి రావడంతో తొక్కిసలాట జరిగి అభిమాని మరణించడంతో ఈయన ఏకంగా జైలుకు కూడా వెళ్లి వచ్చారు. దీంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న అల్లు అర్జున్ ఇప్పుడప్పుడే జనాలలోకి రాకూడదని భావించారట అందుకే ఈ కార్యక్రమానికి చివరి నిమిషంలో క్యాన్సిల్ చేశారని తెలుస్తోంది.

ఇక ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ రాకపోవడంతో అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేశారు. కానీ అల్లు అర్జున్ కి వేడుకకు రాకపోవడానికి అదే ప్రధాన కారణం కాదని ఈయన తీవ్రమైనటువంటి గ్యాస్ట్రిక్ట్ సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలోనే ఈ వేడుకకు రాలేకపోయారు అంటూ అల్లు అరవింద్ తెలియజేశారు. ఇక ఈ చిత్రం అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ అయినటువంటి గీత ఆర్ట్స్ బ్యానర్ పై రాబోతున్న నేపథ్యంలో సినిమాపై కూడా ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా సాయి పల్లవి నటించిన సంగతి తెలిసిందే.