అల్లు అర్జున్ కొత్త సినిమా ‘పుష్ప’ టీజర్ భీభత్సం సృష్టిస్తోంది. బన్నీ చేసిన పుష్పరాజ్ పాత్రను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన ఈ టీజర్ తక్కువ సమయంలోనే రికార్డ్ వ్యూస్ రాబట్టుకుంటోంది. కేవలం రెండు రోజుల్లో 35 మిలియన్ల యూట్యూబ్ వ్యూస్ సొంతం చేసుకుంది. అంతేకాదు ఇప్పటి వరకు 1 మిలియన్ లైక్స్ సొంతం చేసుకుంది. ఇంత తక్కువ సమయంలో మిలియన్ లైక్స్ కొట్టిన టీజర్ ఇదే కావడం విశేషం. పుష్పగా బన్నీ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.
ఇన్నాళ్లు స్టైలిష్ పాత్రలో కనబడిన అల్లు అర్జున్ ఒక్కసారిగా ఇలా డీగ్లామర్ లుక్లోకి రావడం, పాత్ర చాలా బలంగా ఉండటంతో ఆడియన్స్ ఇంప్రెస్ అవుతున్నారు. టీజర్ సినిమా మీద అంచనాలను బాగా పెంచింది. ‘రంగస్థలం’ తర్వాత సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ హిట్ మీద ఉండటంతో ఈ సినిమాకు భీభత్సమైన క్రేజ్ నెలకొంది ఉంది. కేవలం చిన్నపాటి టీజర్ తోనే బన్నీ ఇంత భీభత్సం చేస్తే ముందు ముందు అసలైన టీజర్ ట్రైలర్లకు ఇంకెన్ని రికార్డులు బద్దలుకొడతాడో చూడాలి.