Pushpa part 2 : దాదాపు మన టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా మార్కెట్ లో తమ సినిమాలకంటూ ఒక క్రేజ్ ని కానీ అలాగే తమకంటూ ఒక మార్క్ ని తెచ్చుకున్న హీరోల్లో దాదాపు ఏంటి అందరూ రాజమౌళి నుంచి వెళ్లినవాళ్లే ఉన్నారు.
కానీ అసలు రాజమౌళి బ్రాండ్ లేకుండా హిందీ బెల్ట్ లో 100 కోట్లు కొల్లగొట్టిన మొనగాడు ఎవరన్నా ఉన్నారు అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనే చెప్పాలి.
కేవలం తన సొంత స్టార్డం తో హిందీ బెల్ట్ లో 100 కోట్లకి పైగా వసూలు చేసి “పుష్ప” తో అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు పుష్ప రెండో పార్ట్ కి సిద్ధం అవుతున్నాడు అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా విషయం లో బన్నీ తీసుకున్న నిర్ణయం మాత్రం ఓ రేంజ్ లో ఉందని చెప్పాలి.
బాలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్న దాని ప్రకారం ఈ సినిమాకి అల్లు అర్జున్ అసలు ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవట్లేదట. మరి ఆ ప్లేస్ లో హిందీలో వచ్చే వసూళ్ళలో షేర్ ని తీసుకోవాలని చూస్తున్నాడట.
ఇది మామూలు ప్లాన్ కాదని చెప్పాలి. హిందీలో పార్ట్ 2పై కూడా భారీ డిమాండ్ నెలకొంది. అలాంటిది అక్కడ షేర్ అంటే ఈ సినిమా క్రేజ్ లో మినిమం 200 కోట్లు వసూళ్లు వచ్చినా అందులో 100 కోట్లు బన్నీ కి వస్తాయి.
ఇది మాత్రం అమేజింగ్ అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు విలన్ పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే మరో రెండు నెలల్లో అలా షూటింగ్ మొదలు కానుంది.