Pushpa 2 : బిగ్ అప్డేట్ : “పుష్ప 2” పై భారీ అనౌన్సమెంట్ ఇచ్చిన అల్లు అర్జున్.!

Pushpa 2 : ఈ ఏడాది ఒక్క టాలీవుడ్ దగ్గర మాత్రమే కాకుండా మొత్తం ఇండియన్ సినిమా దగ్గర భారీ హిట్ గా నిలిచిన చిత్రం ఏదన్నా ఉంది అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “పుష్ప పార్ట్ 1” అని చెప్పాలి. భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాలు నడుమ విడుదల అయ్యిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో మరోసారి తెలుగు సినిమా సత్తా చూపించింది.

అయితే లాస్ట్ మినిట్ లో అన్ని భాషల్లో రిలీజ్ పట్ల ఎన్ని ఇబ్బందులు అడ్డంకులు ఈ సినిమాకి ఎదురయ్యాయో అందరికీ తెలిసిందే. అయినా కూడా ప్రతి భాషలో సినిమా హిట్ అయ్యింది. ముఖ్యంగా హిందీలో పుష్ప సినిమాకి వస్తున్న ఆదరణ మాత్రం ఇంకో స్థాయిలో ఉందని చెప్పాలి. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం సక్సెస్ పార్టీ ని చిత్ర బృందం అంతా ఓ రేంజ్ లో చేసుకుంటున్నారు.

మరి అలాగే ఈరోజు కూడా జరిగిన ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ తన రాబోయే పుష్ప పార్ట్ 2 కి సంబంధించి భారీ లెవెల్ అనౌన్సమెంట్ ని అందించాడు. ఈ కొన్ని అవకతవకలతో పాన్ ఇండియా లెవెల్లో పుష్ప 1 ని రిలీజ్ చేసినా ఈసారి మాత్రం పుష్ప పార్ట్ 2 ని భారతదేశం నుంచి ఏ సినిమా కూడా రిలీజ్ కానన్ని ఎక్కువ భాషల్లో రిలీజ్ చేస్తామని భారీ అనౌన్సమెంట్ ఇచ్చాడు. దీనితో ఈ స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.