అల్లు అర్జున్ ఇప్పుడు ఒక పాన్ ఇండియా హీరో. ‘పుష్ప’ సినిమాతో ఒక్కసారిగా అల్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమాలు చెయ్యడానికి టాప్ డైరెక్టర్స్, హీరోయిన్స్ క్యూ కడుతున్నారు. అయితే ఒకప్పుడు ఒకర్ని తన పక్కన హీరోయిన్ గా నటిస్తావా అని అల్లు అర్జున్ అడిగాడట.
అల్లు అర్జున్ మొదటి సినిమా ‘గంగోత్రి’ లో వల్లంగి పిట్ట ..వల్లంగి పిట్ట అనే ఈ పాటలో ఓ చిన్నారి పాప క్యూట్ క్యూట్ స్మైల్ తో అలరించింది గుర్తుందా…ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ పాప పేరు కావ్య కళ్యాణ్ రామ్.
చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన కావ్య ‘మసూదా’ సినిమాలో హీరోయిన్ గ్గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఆలీతో సరదా షోకి వచ్చిన కావ్య తన సినిమా గంగోత్రి టైంలో అల్లు అర్జున్ తో జరిగిన చిన్న ఫన్నీ సంభాషణను బయటపెట్టింది. ప్రజెంట్ ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కావ్య మాట్లాడుతూ..” గంగోత్రి సినిమా టైంలో అల్లు అర్జున్ గారు నువ్వు పెద్ద అయ్యాక కచ్చితంగా హీరోయిన్ అవుతావు అన్నారు. ఆ టైంలో నాకు డేట్స్ ఇస్తావా అని కూడా అడిగారు. అల్లు అర్జున్ కాదు చాలామంది హీరోలు అలా అడిగారు . గంగోత్రి లో హీరోయిన్ గా చిన్నప్పటి క్యారెక్టర్ చేస్తున్న టైంలో అల్లు అర్జున్ పెద్దయ్యాక నువ్వు హీరోయిన్ అవుతావు కదా ..అప్పుడు నీ డేట్స్ కావాలి ఇస్తావా.. అని అడిగారు ..దీంతో అప్పటికి మీరు ముసలోళ్ళు అయిపోతారు కదా ..నాతో ఎక్కడ నటిస్తారు అని అడిగేశాను. ఆ వయసులోనే నా సెన్సాఫ్ హ్యూమర్ పుష్కలంగా ఉంది అంటూ నవ్వేసుకున్నారు ..”అంటూ ఆలీతో సరదాగా షోలో బయటపెట్టింది. అంతేకాదు నిజంగా అల్లు అర్జున్ అప్పుడు అడిగిన మాట ఇప్పుడు అడిగితే అది ఎంత పెద్ద ఆఫర్ అనేది ఆమెకే తెలుసు అంటున్నారు బన్నీ అభిమానులు. మరి చూడాలి చిన్నప్పటి హీరోయిన్ కి అల్లు అర్జున్ ఛాన్స్ ఇస్తాడో లేదో?