Rashmika Mandanna: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక మందన జంటగా నటించిన తాజా చిత్రం పుష్పటు. భారీ అంచనాల నడుమ తాజాగా విడుదలైన ఈ సినిమా రికార్డుల మోత మోగిస్తూ దూసుకుపోతోంది. విడుదల అయ్యి వారం రోజులు కూడా కాకముందే దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ను సాధించి సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ఇప్పటివరకు ఇండియన్ సినిమా చరిత్రలో మరే సినిమా సృష్టించిన ఘనతను పుష్ప 2 సినిమా సృష్టించింది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా తాజాగా 1000 కోట్ల క్లబ్ లోకి చేరింది. కేవలం విడుదలైన ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టి చరిత్ర సృష్టించింది పుష్ప 2.
కేవలం తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ని బట్టి చూస్తే తొందరలోనే ఈ సినిమా 1500 వందల కోట్ల గ్రాస్ ను ఈజీగా దాటేస్తుందనిపిస్తోంది. అయితే పుష్ప 2 సినిమాకి సెకండ్ హాఫ్ కీలకం అని చెప్పాలి. అందులోని జాతర సీన్ కోసం రెండు, మూడు సార్లు సినిమా చూసిన ఆడియాన్స్ కూడా ఉన్నారు. దాదాపుగా 60 కోట్లు ఖర్చు చేసి తీసిన ఈ సీన్ పుష్ప 2 సినిమాకే హైలెట్ అని చెప్పాలి. అయితే ఇంతటి సంచలం సృష్టించిన ఈ సీన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రష్మిక మందన్న. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఇంత బాగా ఆ సీన్ చేయగలిగిన ఏకైక హీరో అల్లు అర్జున్ సర్ మాత్రమే.
నా జీవితంలో ఇలాంటి సీన్ మళ్ళీ చూస్తానని అనుకోట్లేదు..ఇంత దమ్ము, పవర్, ఆల్ఫానెస్ ఉన్న హీరో అసలు చీర కట్టుకొని, చీరలోనే డ్యాన్స్ చేసి, చీరలోనే యాక్షన్ సీక్వెన్సెస్ చేసి, చీరలోనే డైలాగ్స్ చెప్పాడు. అసలు అలా చెయ్యడం ఒక్కసారి మళ్ళి గుర్తుతెచ్చుకోండి. సినిమాలో 21 నిమిషాల పాటు అల్లు అర్జున్ సర్ చీర కట్టుకొనే ఉన్నాడు. అసలు ఏ మగాడు ఇలా చేస్తాడు. ఏ మగాడు దీనికి ఒప్పుకుంటాడు? దీని తర్వాత అయన మీద ఉన్న గౌరవం మరింత పెరిగింది. నా జీవితం మొత్తం అతన్ని సపోర్ట్ చేస్తుంటాను అని రష్మిక చెప్పుకొచ్చింది. అల్లు అర్జున్ చేసిన విధంగా మరే హీరో చేయలేరు అని ఆమె చెప్పుకొచ్చింది.