‘అల వైకుంఠపురములో’ చిత్రంతో స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు అల్లు అర్జున్. ఆయనతో సినిమా చేయడానికి పెద్ద దర్శకులు చాలామంది ఆసక్తి చూపిస్తున్న మాట కూడ నిజమే. అయితే అల్లు అర్జున్ ఈ స్టార్ డమ్ ను సరిగా క్యాష్ చేసుకుంటున్నారా అనేదే డౌట్. డిమాండ్ ఉన్నప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి. చేసే ఒక్కొక్క సినిమా ఒక్కొక్క మెట్టు ఎక్కించేలా ఉండాలి. చేయాల్సిందల్లా జాగ్రత్తగా సినిమాలను సెలెక్ట్ చేసుకోవడమే. అయితే అల్లు అర్జున్ ఈ విషయంలోనే కన్ఫ్యూజ్ అవుతున్నాడని అనిపిస్తోంది.
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ చిత్రం చేస్తున్నాడు ఆయన. ఈ పాన్ ఇండియా చిత్రం రెండు ఇన్స్టాల్మెంట్స్లో ఉండనుంది. అయితే ఈ సినిమా తర్వాత ఎవరితో వర్క్ చేయాలనేది పెద్ద ప్రశ్నగా మారింది బన్నీకి. మొదట కొరటాల శివతో చేద్దామనుకుని ప్రాజెక్ట్ ప్రకటించాడు. ఆ తర్వాత లింగుస్వామిని లైన్లోకి తీసుకున్నాడు. లింగుస్వామి సైడ్ అయిపోయారు కానీ కొరటాల ప్రాజెక్ట్ మీదే క్లారిటీ లేదు. ఆతర్వాత ప్రశాంత్ నీల్ కోసం తీవ్రంగా ట్రై చేశాడు కానీ డేట్స్ లేక ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు. ఇప్పుడేమో మళ్లీ విక్రమ్ కుమార్ పేరు తెరమీదకు వచ్చింది. ఆయన కూడ అల్లు అర్జున్ కోసం కథ రాస్తున్నాడని టాక్. ఇక వేణు శ్రీరామ్ ‘ఐకాన్’ ఎప్పటి నుండో చర్చల్లో ఉంది. దీని మీద కూడ క్లారిటీ లేదు. ఇలా చుట్టూ నాలుగైదు ప్రాజెక్ట్స్ పెట్టుకున్న అల్లు అర్జున్ దేన్ని ఫైనల్ చేసుకోకపోవడం చూస్తుంటే ఆయన కన్ఫ్యూజన్లో ఇరుక్కుపోయినట్టే అనిపిస్తోంది.