Allu Arjun: పద్మభూషణ్ గ్రహీత బాలయ్యకు అభినందనలు చెప్పిన బన్నీ… మీరు అర్హులు అంటూ?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈయనకు పద్మభూషణ్ అవార్డు రావడంతో అల్లు అర్జున్ ఇంస్టాగ్రామ్ వేదికగా పద్మ భూషణ్ అవార్డు అందుకున్న బాలకృష్ణతోపాటు ఇతర పద్మ అవార్డు గ్రహీతలదరికీ కూడా ఈయన శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మ అవార్డులను ప్రకటించడంతో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి బాలయ్యకు ఈ పురస్కారాన్ని అందజేశారు.

ఇలా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో బాలకృష్ణ పేరు ఉన్న నేపథ్యంలో ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు అభిమానులు రాజకీయ నాయకులు బాలకృష్ణకు అభినందనలు తెలిపారు. ఇలా తనకు అభినందనలు తెలిపిన వారందరికీ బాలకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే తనకు ఈ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ఈయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఎన్టీఆర్ తర్వాత నందమూరి వారసుడిగా వచ్చిన తనని ప్రేక్షకులు ఆదరిస్తూ తన వెంటే నిలిచి నేడు తనని ఈ స్థాయికి తీసుకొచ్చిన అభిమానులకు తాను ఎప్పుడు రుణపడి ఉంటానని బాలకృష్ణ ఎమోషనల్ అయ్యారు. తాజాగా అల్లు అర్జున్ సైతం బాలయ్యకు పద్మభూషణ్ రావడంతో సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తెలుగు సినిమాకు మీరు అందించిన సేవలకు గాను పద్మభూషణ్ అవార్డు అందుకోవడానికి మీరు పూర్తి అర్హులు అంటూ బాలకృష్ణకు అభినందనలు తెలియజేశారు అదే విధంగా నటుడు అజిత్ కూడా ఇదే అవార్డును అందుకోవడంతో ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ.. హీరో అజిత్ సాధించిన ఘనత తనకు స్ఫూర్తిగా నిలిచిందని తెలిపారు. ఇక పద్మ అవార్డులు అందుకున్న నటి శోభన, శేఖర్ కపూర్, అనంత్ నాగ్ లకు అభినందనలు అంటూ అల్లు అర్జున్ పోస్ట్ చేశారు.