Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సొంత పార్టీ నేత సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఊహించని విధంగా షాక్ ఇచ్చారు.. సొంత కాంగ్రెస్ పార్టీ నేత అయినప్పటికీ కూడా చంద్రశేఖర్ రెడ్డి రేవంత్ రెడ్డి గురించి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి సోమవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ మామ సైతం రేవంత్ రెడ్డి గురించి ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చారు.కేబీఆర్ పార్కు వద్ద రోడ్డు విస్తరణలో తన ఇంటి స్థలం సేకరణ పై ఒకసారి పునరాలోచన చేయాలని.. ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది.
గత కొన్ని నెలల కిందట కేబీఆర్ పార్కు చుట్టూ జంక్షన్ల అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే అయితే ఈ అభివృద్ధిలో భాగంగా కొంతమంది సెలబ్రిటీల ఇల్లు కూడా తొలగించాల్సి వస్తుంది అలాంటి వాటిలో బాలకృష్ణ ఇంటితో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఇల్లు అలాగే జానారెడ్డి ఇల్లు కూడా ఉందని తెలుస్తోంది.
అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఇతరులు ఎవరూ స్పందించకపోయినా చంద్రశేఖర్ రెడ్డి మాత్రం ఇలా ప్రజావాణిలో ఫిర్యాదు ఇవ్వడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. అయితే అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి పగ ప్రతీకారాలతో తన ఇంటిని కచ్చితంగా కూల్చివేస్తారని భావించిన చంద్రశేఖర్ రెడ్డి ముందుగానే ఇలా ఫిర్యాదు చేశారని స్పష్టం అవుతుంది.
ఇక పుష్ప 2 విడుదల సమయంలో తొక్కిసలాట జరిగే రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ ఏకంగా ఆయనని జైలుకు కూడా పంపించారు ఈ తరుణంలోనే రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి ఇక తన అల్లుడిని అరెస్టు చేయడంతో చంద్రశేఖర్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి తీరుపై మండి పడిన సంగతి తెలిసిందే.