‘పుష్ప’ ప్లాన్ మారింది. సినిమాను మొదలుపెట్టేటప్పుడు ఒక పార్ట్ అనే అనుకున్నారు. బడ్జెట్ కూడ నిర్ణయించారు. కానీ ఇప్పుడు రెండు పార్ట్స్ అంటున్నారు. ఉన్నపళంగా వచ్చిన ఈ ఆలోచన అభిమానులను సైతం కన్ఫ్యూజ్ చేస్తోంది. ఇంత పెద్ద భారీ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఒక పార్ట్ సరిపోతుందా లేకపోతే రెండు కావాలా అనేది స్పష్టత లేకుండా అయితే ఉండదు. ఒకవేళ కంటెంట్ ఎక్కువైతే సినిమా రన్ టైమ్ పెంచడం జరుగుతుంది కానీ ఏకంగా రెండవ పార్ట్ కు శ్రీకారం చుట్టడం దాదాపు అసాధ్యం. కానీ ‘పుష్ప’ విషయంలో అలానే జరుగుతోంది. దాదాపు షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న తరవాత సినిమాను రెండు భాగాలు చేయాలనే ఐడియా వచ్చింది సుకుమార్ బృందానికి.
మరి ఈ ఆలోచనకు కారణం డెడ్ లైన్ దగ్గరకొస్తున్నా షూటింగ్ పూర్తికాకపోవడంతో సుకుమార్ స్క్రిప్ట్ చేంజెస్ చేసి రెండవ భాగానికి తగ్గట్టు లీడ్ ఇచ్చే పని పెట్టుకున్నారా లేకపోతే నిజంగానే కథలో రెండు భాగాలకు సరిపడా కంటెంట్ ఉందని చివరి నిముషంలో సుకుమార్ కు నమ్మకం వచ్చిందా అనేది తెలియట్లేదు. కారణం ఏదైనా ఈ రెండు భాగాల కాన్సెప్ట్ బన్నీ అభిమానులను మాత్రం డైలమాలో పడేసింది. సినిమా ఆరంభంలోనే రెండు భాగాలు అని చెప్తే ఏర్పడే నమ్మకం వేరేకా ఉంటుంది. అదే ఇలా ఆఖరి నిమిషంలో చెప్తేనే లేని పోని అనుమానాలు, అపోహలు మొదలవుతాయి.