అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహా రెడ్డిని సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న అభిమానులకి వారి ముద్దుల కూతురు ‘అల్లు అర్హ’ బాగా సుపరిచుతురాలు. చిన్నారి అర్హ చేసే చిలిపి వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయటంతో బాగా ఫేమస్ అయ్యింది. అయితే ఇప్పుడు అర్హ పాప వెండితెర మీద నటించేందుకు రెడీ అయ్యింది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘శాకుంతలం’ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అల్లు అర్హ నటుస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మూవీలో రాజకుమారుడు భరతుడిగా ఆమె నటించబోతున్నట్టు చిత్రబృందం ధృవీకరించింది.
“అల్లు ఫ్యామిలీ నుండి నాలుగవ తరం కూడా చిత్ర పరిశ్రమలోకి ఆరంగ్రేట్రం చేయటం గర్వకారణంగా ఉందని, తన కుమార్తెకు డెబ్యూ మూవీగా శాకుంతలం లాంటి బ్యూటిఫుల్ మూవీ ఇచ్చినందుకు గుణశేఖర్ దంపతులకు” అల్లు అర్జున్ కృతఙ్ఞతలు తెలియచేశారు. ఇక సినిమా విషయానికొస్తే… మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ‘శాకుంతలం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ వ్యయంతో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ మూవీలో సమంత-శకుంతలగా, మలయాళ నటుడు దేవ్ మోహన్- దుష్యంతునిగా నటిస్తున్నారు.
A proud moment for the Allu family to announce that the fourth generation, #AlluArha will be making her debut with #Shakuntalam movie. I want to thank @Gunasekhar1 garu & @neelima_guna garu for giving my daughter this beautiful movie as her debut . pic.twitter.com/iPfXQaqJCk
— Allu Arjun (@alluarjun) July 15, 2021