అల్లు అర్జున్ గుర్తించలేకపోయిన రష్మిక.. కాస్త ఓవర్ కదా!

రష్మిక మందన్న పరిచయం అవసరం లేని పేరు కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె భాషతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇలా తెలుగు తమిళ కన్నడ హిందీ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా పలు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఈమె ఎంతో యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియా వేదికగా రష్మిక చేసే హంగామా మామూలుగా ఉండదు.

సోషల్ మీడియా వేదికగా ఈమె తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అయితే కొన్ని సందర్భాలలో ఈమె కాస్త ఓవర్ గా బిహేవ్ చేసినట్టు అనిపిస్తుంది. ఈ క్రమంలోనే నేటిజన్ల ట్రోలింగ్ కూడా గురవుతూ ఉంటారు.అయితే తాజాగా రష్మికపై నేటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడటమే కాకుండా నెగటివ్ కామెంట్లతో ట్రోల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఒక యాడ్ కోసం పూర్తిగా తన లుక్ మార్చుకున్న విషయం మనకు తెలిసిందే. ఎంతో స్టైలిష్ లుక్ లో అల్లు అర్జున్ ఈ యాడ్ లో నటించారు.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఈ లుక్ చూసిన అభిమానులు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు.ఇక ఈ ఫోటోని అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటో క్షణాల్లో వైరల్ అయ్యింది. ఈ పోస్ట్ పై రష్మిక స్పందిస్తూ ఇక్కడ మీరు అని ఒక్క నిమిషం పాటు గుర్తించలేకపోయాను సార్ అంటూ కామెంట్ చేశారు.ఈ క్రమంలోనే ఈ పోస్టు వైరల్ కావడంతో ఎంతో మంది నెటిజెన్లు సమంతపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయినా నీకు తెలుగు హీరోలు ఎందుకు గుర్తుంటారు రష్మిక బాలీవుడ్ ముఖాలు మాత్రమే గుర్తుంటాయి అంటూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. అల్లు అర్జున్ తో నటించి ఆయననే గుర్తించలేకపోవడం కాస్త ఓవర్ గా అనిపించడం లేదా అంటూ బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.