అత్తారింట్లో సంక్రాంతి పండుగ జరుపుకున్న అల్లు అర్జున్… వైరల్ అవుతున్న ఫోటోలు!

రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరిగాయి. సాధారణ ప్రజల నుంచి మొదలుకొని సెలబ్రిటీల వరకు ఘనంగా సంక్రాంతి సంబరాలను జరుపుకుంటున్నారు. ముఖ్యంగా పట్టణాలలో నివసించే వారందరూ కూడా ఈ పండుగను జరుపుకోవడం కోసం పల్లెలకు వెళ్లి అక్కడ సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు సైతం తమ సొంత గ్రామాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నందమూరి మంచు ఫ్యామిలీ సభ్యులు తమ సొంత గ్రామాలలో సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు.

అల్లు అర్జున్ సైతం సంక్రాంతి పండుగ సందర్భంగా తన అత్తారింటికి వెళ్లినట్టు తెలుస్తుంది. పుష్ప 2 సినిమా షూటింగ్ తో ఎంతో బిజీగా ఉన్నటువంటి అల్లు అర్జున్ తన సినిమా షూటింగ్ కాస్త విరామం నుంచి సంక్రాంతి పండుగ కోసం తన భార్య పిల్లలతో కలిసి తన అత్తారింటికి వెళ్లి అక్కడే ఈ పండుగ వేడుకలను జరుపుకున్నట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే స్నేహారెడ్డి సంక్రాంతి వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు అవుతున్నాయి.

ఇలా సెలబ్రిటీలు అందరూ కూడా తమ సొంత గ్రామాలకు వెళ్లి ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఇక భోగి సంక్రాంతితో పాటు కనుమ పండుగను కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో ఘనంగా జరుపుకున్నట్టు తెలుస్తుంది. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ తో ఎంతో బిజీగా ఉన్నారు.అల్లు స్నేహారెడ్డి మాత్రం నిత్యం తనకు సంబంధించిన విషయాలను మాత్రమే కాకుండా తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకునీ అభిమానులను సందడి చేస్తుంటారు.