Atlee: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారనే విషయంపై ఎంతో ఆసక్తి నెలకొంది నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ తోసినిమా చేయాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో బన్నీ అట్లీతో మరో సినిమాకు కమిట్ అయ్యారు.
ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో సన్ పిక్చర్ సమస్త భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతుంది. ఏప్రిల్ 8వ తేదీ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు సమాచారం.
ఇదిలా ఉండగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ ను రంగంలోకి దింపడానికి అట్లీ సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను ఈ సినిమాలో తీసుకోవాలనే ఆలోచనలో డైరెక్టర్ అట్లీ ఉన్నట్టు సమాచారం.
ఈమె హాలీవుడ్ సినిమాలలో నటిస్తూ గ్లోబల్ బ్యూటీగా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈమె బన్నీ సినిమాలో కూడా నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో నటించడం కోసం ప్రియాంక చోప్రాకు 30 నుంచి 40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఇది మాత్రం వైరల్ అవుతుంది.