Allu Arjun : మరోసారి బాలీవుడ్ ని దున్నేయడానికి బన్నీ రెడి.. ఈ బ్లాక్ బస్టర్ బొమ్మతో.!

Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అనే టాగ్ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనే టాగ్ కి కంప్లీట్ గా ఇప్పుడు బన్నీ మారిపోయాడు. అయితే ఇదిలా వుండగా తాను నటించిన రీసెంట్ భారీ బ్లాక్ బస్టర్ “పుష్ప పార్ట్ 1” తో పాన్ ఇండియా హీరోగా అసలెలాంటి ప్రమోషన్స్ లేకుండా సత్తా చాటి చాలా మందికి నోరు మెదపకుండా చేసాడు.

ఈ ప్యాండిమెక్ టైం లో కూడా 85 కోట్లకు పైగా ఒక్క బాలీవుడ్ నుంచే బన్నీ రాబట్టడం విశేషం అయితే ఇప్పుడు ఈ సినిమా క్రేజ్ ని మళ్లీ పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. తాను నటించిన రీసెంట్ మరో బ్లాక్ బస్టర్ బొమ్మ, బుట్ట బొమ్మ సెన్సేషన్ “అల వైకుంఠ పురములో” చిత్రాన్ని హిందీలో డబ్ చేసి రిలీజ్ చెయ్యాలని చూస్తున్నారట.

ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే ఈ సినిమాని ఆల్రెడీ హిందీలో రీమేక్ చెయ్యడానికి ప్రముఖ నిర్మాతలు కొనుగోలు చేశారు. అయినా ఇప్పుడు మళ్లీ ఒరిజినల్ వెర్షన్ ని హిందీలో దింపేందుకు రెడీ అయ్యాడు. అయితే ఈ చిత్రాన్ని ఈ వచ్చే జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చెయ్యబోతున్నారట. మరి ఈ సినిమా ఎలాంటి ఆదరణ అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే..