సోషల్ మీడియాలో అల్లు వారి డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. అల్లు వారి చిచ్చర పిడుగులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అల్లు అర్హ, అల్లు అయాన్‌లు సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా బుగ్గల అర్హ చేసే చేష్టలు, ముద్దు మాటలు, క్యూట్ క్యూట్ స్టెప్పులు నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటాయి. ఇక అర్హ అల్లరి అల్లు అర్జున్ తోడైతే ఇక అది వేరే లెవెల్‌లో ఉంటుంది.
ఆ మధ్య తండ్రీకూతుళ్ల చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. పెళ్లి విషయంలో అర్హను ఒప్పించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు బన్నీ. ఇప్పటికే దాదాపు ఓ మూడొందల సార్లు అడిగి విసుగుచెందాట. అయినా సరే పెళ్లి విషయంలో నాన్న మాట వినాలని, నాన్న చెప్పినవాడినే చేసుకుంటానని అర్హ చేత చెప్పించాలని బన్నీ పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు.
ఇక అన్న అల్లు అయాన్‌తో అర్హ చేసే అల్లరి, బుల్లి బైకులు నడపడం ఇంట్లో సందడి సందడి చేయడం చూస్తూనే ఉంటాం. ఇక తాజాగా అర్హ ఏకంగా పెద్ద సాహసానికే ఒడిగట్టింది. ఈ మధ్యే అల్లు ఫ్యామిలీని విహారానికి బయటకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అర్హ ఓ పేద్ద బండను కదిలించాలని తెగ ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. అర్హ ప్రయత్నాన్ని అల్లు స్నేహా తన కెమెరాలో బంధించింది. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది.