TG: రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ వివాదం…. సంచలన నిర్ణయం తీసుకున్న అల్లు అరవింద్?

TG: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పూర్తిస్థాయిలో టార్గెట్ చేసి ఆయనని ఇబ్బందులకు గురిచేసిన విషయం తెలిసిందే. పుష్ప 2 సినిమా విడుదల సమయంలో సంధ్యా థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వెళ్లారు అయితే అక్కడ అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో భాగంగా ఒక అభిమాని మరణించడమే కాకుండా చిన్నారి శ్రీ తేజ్ ఇప్పటికీ హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు.

ఈ క్రమంలోనే ప్రజల ప్రాణాల పట్ల ఎంతో బాధ్యత రహితంగా వ్యవహరించినటువంటి అల్లు అర్జున్ పై పోలీస్ కేసు నమోదు చేయడమే కాకుండా ఏకంగా ఆయనని జైలుకు పంపించిన సంగతి తెలిసిందే. ఇలా అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ సినిమా ఇండస్ట్రీని కూడా రేవంత్ రెడ్డి ఇబ్బంది పెట్టారు. తెలంగాణలో తను ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు ఎలాంటి సినిమాలకు టికెట్ల రేట్లు పెంచనని బెనిఫిట్ షోలకు కూడా అనుమతి తెలపనని రేవంత్ రెడ్డి మాట్లాడారు.

ఈ విషయంపై సినీ పెద్దలందరూ కలిసినప్పటికీ కూడా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోనని తెలిపారు. కానీ దిల్ రాజు సినిమాకు మాత్రం టికెట్ల రేట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడంతో రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇలా అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో నిర్మాత అల్లు అరవింద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

అల్లు అరవింద్ సమర్పణలో నాగచైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం తండేల్. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమాకు ఏపీలో సినిమా టికెట్ల రేట్లు పెంచుతూ బెనిఫిట్ షోలకు కూడా అనుమతి తెలిపారు కానీ తెలంగాణలో మాత్రం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు ఇదే విషయం గురించి అల్లు అరవింద్ ను రిపోర్టర్ ప్రశ్నించారు. తెలంగాణలో సినిమా టికెట్ల ధర పెంపు అడగలేదా? అని మీడియా ప్రశ్నించగా.. అల్లు అరవింద్‌ స్పందిస్తూ..

తండేల్ సినిమాకు తెలంగాణలో టికెట్ ధరలు పెంచాలని అడగలేదు. అడగాల్సిన అవసరం కూడా మాకు లేదని తెలిపారు. ఇక బెనిఫిట్ షోలకు కూడా అనుమతి అడగలేదని మా సినిమాకు అంత బెనిఫిట్స్ అవసరం లేదు అంటూ అల్లు అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.