Allu Aravind: మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రస్తుతం తండేల్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా అల్లు అరవింద్ రామ్ చరణ్ సినిమా గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై మెగా ఫాన్స్ ఫైర్ అవుతున్న విషయం మనకు తెలిసిందే.
ఈ సినిమా వేడుకలో భాగంగా దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు అయితే ఆయనని ఉద్దేశించి అల్లు అరవింద్ మాట్లాడుతూ మీరు ఈ సంక్రాంతి పండుగకు రెండు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఒక సినిమా అలా నేలకు వెళ్లింది మరో సినిమా అలా ఆకాశంలోకి వెళ్లి ఇన్కమ్ టాక్స్ అధికారులు కూడా వచ్చేలా చేసేశారు. ఇలా వారం రోజుల వ్యవధిలో మీ వల్ల ఎన్నో సంఘటనలు జరిగాయి అంటూ మాట్లాడారు.
ఇలా అల్లు అరవింద్ మాట్లాడటంతో దిల్ రాజు కూడా ఈ వ్యాఖ్యలను సరదాగా తీసుకొని నవ్వుతూ కనిపించారు కానీ మెగా అభిమానులు మాత్రం అల్లు అరవింద్ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నారు. అల్లు అరవింద్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాని ఉద్దేశించి అలా మాట్లాడారు అంటూ అల్లు అరవింద్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ మరోసారి చరణ్ సినిమా గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తండేల్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓ బాలీవుడ్ మీడియాకు ఈయన ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా మగధీర సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి రాజమౌళి లాంటి ఒక డైరెక్టర్ తో సినిమా చేయాలని ఎందుకు అనిపించింది ఎందుకు మగధీర సమయంలో ఆయనని అప్రోచ్ అయ్యారు అంటూ ప్రశ్న ఎదురైంది.
ఈ ప్రశ్నకు అల్లు అరవింద్ సమాధానం చెబుతూ… నా అల్లుడు చరణ్ చేసిన మొదటి సినిమా యావరేజ్ గా నిలిచింది ఆ తరువాత చేసే సినిమాకు నేనే నిర్మాత అందుకే నా అల్లుడికి పెద్ద హిట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే రాజమౌళి వద్దకు వెళ్లి మాట్లాడానని తెలిపారు. చాలా ఖర్చు పెట్టాను. అదే మగధీర తీయడానికి ప్రధాన కారణం. నేను అనుకున్నట్టుగానే చరణ్ తో పెద్ద సినిమా చేసి అతనికి మంచి హిట్ ఇచ్చానని నాకు చరణ్ పై ఉన్న ప్రేమ అదే అంటూ అల్లు అరవింద్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.