ఆలీ తెలుగు సినిమా హాస్యనటుడిగా అందరికీ సుపరిచితమే. ఆలీ 1968లో రాజమండ్రిలో జన్మించాడు. ఇతని పూర్తి పేరు మహమ్మద్ అలీ. ఇతని తమ్ముడు ఖయ్యూం. ఇతడు కూడా సినిమాలలో సహాయ పాత్రలలో నటిస్తూ రాణిస్తున్నాడు. ఆలీ, జుబేదాను వివాహం చేసుకున్నాడు వీరికి ముగ్గురు పిల్లలు. ఫాతిమా రమీజూన్, జుబేరియా అనే అమ్మాయిలు, మహమ్మద్ భాష అనే అబ్బాయి సంతానం.
రాజమండ్రిలో కే. విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్న ప్రెసిడెంట్ పేరమ్మ చిత్రీకరణ జరుగుతుంది. ఆ సమయంలో అక్కడ ఉన్న వారిని నవ్వించడం గమనించిన విశ్వనాథ్ గారు ఆలీకి బాల నటుడిగా ఆ సినిమాలో అవకాశం కల్పించారు. అలా వరుసగా కొన్ని సినిమాలలో పాలనటుడుగా చేశాడు ఆలీ. ఏడిద నాగేశ్వరరావు గారు ఈ సినిమాలను చూసి సీతాకోకచిలుకలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. కొంతకాలానికి హాస్యనటుడుగా పలు సినిమాలలో నటిస్తూ ఉండగా రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో ఆలీ చేసిన ఎంత చాట అనే కామెడీ ఎన్నటికీ మర్చిపోలేనిది.
తర్వాత ఎస్ వి కృష్ణారెడ్డి గారు యమలీల సినిమా ద్వారా హీరోగా అవకాశం ఇచ్చారు. ఈ సినిమా మంచి విజయం సాధించి గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఇలా సినిమాలలో రాణిస్తున్న ఆలీ దాదాపు 1100 పైగా చిత్రాల్లో నటించారు. ఈయన బుల్లితెరపై కూడా కొన్ని షోలను యాంకరింగ్ చేస్తూ ఆలీతో సరదాగా అదే ప్రోగ్రాం మంచి పేరు తెచ్చుకుంది.
ఆలీకి అమ్మానాన్న తమిళ అమ్మాయి, సూపర్ సినిమాలకు ఉత్తమ హాస్యనటుడిగా ఫిలింఫేర్ పురస్కారం దక్కింది. తన తండ్రి పేరు మీద మహమ్మద్ భాష చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదలకు సేవలు అందిస్తున్నాడు. 1999లో నటుడు మురళీమోహన్ తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం ఇప్పించాడు. తరువాత ఆయన కొన్ని రాజకీయ పార్టీలకు ప్రచారం చేశారు. 2019లో వైయస్సార్ పార్టీలో చేరి కొనసాగుతున్నారు.
ఇక అసలు విషయానికొస్తే ఆలీ పెద్ద కూతురు ఫాతిమా రమీజూన్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. సాయికుమార్ దంపతులు హాజరై సందడి చేశారు. కమెడియన్ బ్రహ్మానందం కూడా ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. కాబోయే వరుడు ఇంట్లో అందరూ డాక్టర్లే. వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆలీ దంపతులు సందడి చేశారు దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆలీ భార్య జుబేదా తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశారు.