Alia Bhatt : ప్రస్తుతం ఓ పాన్ ఇండియా సినిమా అంటే దానికి ప్రభాస్ తారాగణం ఎంతో కీలకం. సినిమాకి తగ్గట్టు పాత్రల కోసమే ఇతర భాషల నటుల్ని తీసుకుంటున్నామని చెప్తున్నారు కానీ వారి వల్ల అయితే తెలుగులో అంత ఎఫెక్ట్ ఏమి కనిపించదు.
అలా లేటెస్ట్ గా ఇండియా బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అయ్యినటువంటి చిత్రం టీపుల్ ఆర్(RRR) విషయంలో కూడా ఇదే జరిగింది.
ఈ సినిమా లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించగా వారి సరసన ఆలియా భట్ మరియు ఒలీవియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించారు.
అయితే వీరిలో ఆలియా భట్ ని మేకర్స్ బాలీవుడ్ నుంచి దింపారు. అక్కడ వరకు బాగానే ఉన్నా ఇపుడు ఈమె విషయంలో మాత్రం ఓ కాంట్రవర్సీ పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.
ఇలాంటి గ్రేట్ సినిమాలో భాగం అయ్యిన ఈమె తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నుంచి RRR సినిమాకి సంబంధించిన పోస్టులు డిలీట్ చెయ్యడం కలకలం రేపింది.
అయితే ఇది తాను కావాలనే చేసింది అని చిత్ర యూనిట్ కి ఈమెకి పడలేదు అని అనేక రూమర్స్ వైరల్ అయ్యాయి. అయితే అసలు దీనిపై ఆలియా భట్ క్లారిటీ ఇవ్వడం సినీ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
తాను కావాలని చేసింది కాదని తన సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు అలా చూసినపుడు చిందరవందరగా అనిపిస్తుంది అని అందుకే రెగ్యులర్ గా నేను కొన్ని పోస్టులు తీసేస్తాను అలా RRR పై కూడా తీసి ఉండొచ్చు తప్ప అందులో వేరే అర్ధం ఏమి లేదని ఆ చిత్ర యూనిట్ నాకు మంచి అనుబంధం ఉందని ఒక క్లారిటీ ఇచ్చింది. దీనితో ఈ క్లారిటీ సినీ వర్గాల్లో మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది.