ఫోన్ స్విచ్చాఫ్.. రాహుల్‌కు అలీ రెజా షాక్

Ali Reza Shocks Rahul Sipligunj

రాహుల్ సిప్లిగంజ్ అలీ రెజా జాన్ జిగ్రీ దోస్తులైపోయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ మూడో సీజన్ మొదట్లో ఇద్దరూ కాస్త దూరంగా ఉన్నా కూడా రాను రాను మాత్రం దగ్గరయ్యాయి. అలీ రెజా రీ ఎంట్రీ తరువాత కథ మారిపోయింది. అలీ రెజా రీ ఎంట్రీ ఇచ్చాక రాహుల్ సిప్లిగంజ్‌తో బాగా క్లోజ్ అయ్యాడు. అలా అక్కడి నుంచి ఈ ఇద్దరి బంధం నేటి వరకు కొనసాగుతూనే వస్తోంది. కలిసి పార్టీలు, ఈవెంట్‌లతో సందడి చేస్తుంటారు.

Ali Reza Shocks Rahul Sipligunj
Ali Reza Shocks Rahul Sipligunj

ఈ నాల్గో సీజన్‌లోనూ అలీ రెజా, రాహుల్ సిప్లిగంజ్‌లు సోహెల్‌నే సపోర్ట్ చేశారు. నాల్గో సీజన్ ముగిశాక సోహెల్ రాహుల్ అలీ రెజా మెహబూబ్ ఇలా అందరూ కలిసి పార్టీలు చేసుకున్నారు. సంక్రాంతిని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇక నిన్న ఊకో కాక స్టోర్ ఓపెనింగ్ ప్రారంభోత్సవంలోనూ మూడో సీజన్ కంటెస్టెంట్లు రచ్చ చేశారు. ఈ క్రమంలో అలీ రెజా, సోహెల్, మెహబూబ్, శివజ్యోతి, రోహిణి, అషూ అందరూ కలిసి హల్చల్ చేశారు.

అలా స్టోర్ ఓపెనింగ్, ఆ మూడ్‌, ఆ పార్టీలో ఉన్న రాహుల్ లేట్ నైట్ పడుకున్నట్టున్నాడు. రాహుల్ ఫోన్ స్విచ్చాఫ్ అని వస్తుందని పొద్దు పొద్దున్నే ఇంటికి వచ్చేశాడట. పడుకున్న నన్ను ఇలా లేపాడంటూ.. నా నిద్ర కరాబ్ చేసేసిండు అంటూఅలీ రెజా మీద రాహుల్ కంప్లైంట్ చేశాడు. మొత్తానికి రాహుల్ అలీ రెజాలు కలిసి రంగమార్తాండ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అలీ రెజా వైల్డ్ డాగ్‌లో స్పెషల్ రోల్ పోషిస్తోన్నాడు.