Akira Nandan Silver Screen : పవన్ వారసుడు అకీరానందన్ తెరంగేట్రం ఎప్పుడంటే.!

Akira Nandan's Silver Screen Entry Soon

Akira Nandan Silver Screen : పవన్ కళ్యాణ్ వారసుడు అకీరానందన్ తెరంగేట్రానికి సర్వం సిద్ధమైనట్టేనా.? అంటే అవుననే అంటున్నాయ్ టాలీవుడ్ వర్గాలు. పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణుదేశాయ్ కుమారుడైన అకీరానందన్‌పై పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ చాలా చాలా ఎక్కువన్న సంగతి తెలిసిందే.

ఇండస్ట్రీకి రాకముందే, మ్యూజిక్, డాన్స్, తదితర అంశాలపై అకీరానందన్ పట్టు సాధించాడు. ఇక యాక్టింగ్ స్కిల్స్ కూడా ఎక్కువే మనోడికి. ఎంతైనా మెగా ఫ్యామిలీ వారసుడు కదా. ఆటిట్యూడ్‌లో తండ్రి పవన్ కళ్యాణ్‌ని అచ్చం అలా దించేస్తుంటాడు అకీరానందన్.

చిన్నప్పుడే ఓ మరాఠీ సినిమాలో యాక్ట్ చేసిని అనుభవం కూడా వుంది అకీరానందన్‌కి. ఇక తెలుగు తెరపై తండ్రి లెగసీని కొనసాగించేందుకు సిద్ధమైపోతున్నాడట. త్వరలోనే ఓ మంచి సినిమాతో అకీరానందన్ ఎంట్రీ వుండబోతోందని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ అకీరా కోసం కథ సిద్దం చేసిందని తెలుస్తోంది.

ఇకపోతే, రేణూ దేశాయ్ ఈ మధ్యనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. మాస్ రాజా రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న ‘టైగర్’ సినిమాలో రేణూ దేశాయ్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మధ్యనే ఈ సినిమా ప్రారంభోత్సవం కార్యక్రమంలో రేణూ దేశాయ్ సందడి చేసింది.

ఓ వైపు తాను సినిమాల్లో బిజీ అవుతూనే, మరోవైపు కొడుకు అకీరానందన్‌‌ కోసం కూడా గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసేస్తోందట రేణూదేశాయ్.