దసరా సందర్భంగా హీరోలంతా తమ సినిమాలకు సంబంధించిన కొత్త కొత్త అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఫస్ట్ లుక్స్‌తో పాటు టీజర్, ట్రైలర్స్ కూడా విడుదల చేస్తున్నారు. ఇప్పుడు అఖిల్ అక్కినేని కూడా ఇదే చేస్తున్నాడు. ఈయన ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాతో వస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 నిర్మిస్తుండటం విశేషం. బొమ్మరిల్లు, పరుగు సినిమాల తర్వాత భాస్కర్‌ను ప్రేక్షకులు పూర్తిగా మరిచిపోయారు. అలాంటి దర్శకుడు చెప్పిన కథ నచ్చి అఖిల్ ఇప్పుడు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ టీజర్ ఇప్పటికే విడుదలైంది. ఇందులో హర్ష అనే పాత్రలో నటిస్తున్నాడు అఖిల్. పూజా హెగ్డే హీరోయిన్. పెళ్లి, కెరీర్ నేపథ్యంలో కథ రాసుకున్నాడు భాస్కర్. ఇన్ని ఫ్లాపులు వచ్చిన తర్వాత కూడా అఖిల్, నాగార్జున ఈ కథను ఫైనల్ చేసారంటే కచ్చితంగా ఇందులో విషయం ఉంటుందని అక్కినేని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అంతేకాకుండా గీతా ఆర్ట్స్ నమ్మిందంటే కచ్చితంగా అందులో మ్యాటర్ ఉంటుందనే నమ్మకం అందర్లోనూ ఉంది.
అక్టోబర్ 25న ఉదయం 11.40 నిమిషాలకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ టీజర్ విడుదల కానుంది. ఇదే విషయం ట్వీట్ చేసారు దర్శక నిర్మాతలు. ఇదిలా ఉంటే సినిమాలో కొన్ని సన్నివేశాలపై నాగార్జున అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. వీటిని రీ షూట్ చేయాలని దర్శకుడికి నాగార్జున సూచించినట్లు ప్రచారం కూడా జరుగుతుంది. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ గతంలో కూడా కొన్ని సినిమాలకు రీ షూట్ చేయించాడు నాగార్జున. రీ షూట్ చేస్తే సినిమా బాగోకపోవడం కాదు.. ఇంకా బాగా చేయడానికి ప్రయత్నం అని చెప్తాడు నాగార్జున.
ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా కొన్ని సన్నివేశాలను ఇంకా బాగా షూట్ చేయాలని ప్రయత్నించాలని బొమ్మరిల్లు భాస్కర్‌కు నాగార్జున చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇప్పుడు నాలుగో సినిమాపై ఆశలు బాగానే పెట్టుకున్నాడు అఖిల్. ఇలాంటి సమయంలో నాగార్జున కూడా కొడుకు సినిమాపై ఫోకస్ చేస్తున్నాడు. సినిమాను ఎప్రిల్‌లోనే విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా కూడా ఉండటంతో కాలేదు. గీతా ఆర్ట్స్ నిర్మిస్తుండటంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాపై ఆసక్తి బాగానే ఉంది. మొత్తానికి నాలుగో సినిమాతో అయినా అఖిల్ అకౌంట్ ఓపెన్ చేస్తాడో లేదో చూడాలి.