అఖిల్ అక్కినేని కి తీరని కష్టాలు

అక్కినేని కుటుంబం నుండి వచ్చిన మూడో జనరేషన్ హీరో అఖిల్. తాత నాగేశ్వర్ రావు, నాన్న నాగార్జున స్టార్ హీరోలుగా ఎదిగితే అఖిల్ మాత్రం ఇప్పటివరకు ఒక్క సరైన హిట్ కూడా ఇవ్వలేదు. ఇండస్ట్రీ లోకి వచ్చి ఏడు సంవత్సరాలు అవుతున్న కానీ చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నాడు.

ఇప్పటివరకు వచ్చిన సినిమాలు ఏవి కూడా ప్రేక్షకులని అలరించలేకపోయాయి. అయితే ఇప్పుడు తన హోప్స్ అన్నీ సురేందర్ రెడ్డి ‘ఏజెంట్’ సినిమా మీదే ఉన్నాయి. ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. లుక్ కోసం బాడీ ని మంచి షేప్ లోకి తెచ్చుకున్నాడు. సురేందర్ రెడ్డి అంటే స్టైలిష్ ఆక్షన్ సినిమాలు తీస్తాడని మంచి పేరు ఉంది. ‘కిక్’, ‘రేస్ గుర్రం’ లాంటి సూపర్ హిట్స్ అందించిన సురేందర్ రెడ్డి మీదే అఖిల్ ఆశలన్నీ పెట్టుకున్నాడు.

ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యాక సినిమా మీద అంచనాలు పెరిగాయి, కానీ మొదటినుండి ఈ సినిమా రిలీజ్ డేట్ పైన మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఈపాటికి ఈ సినిమా రిలీజ్ అయిపోవాలి, అయితే ఎందుకో ఈ రిలీజ్ అంశం మాత్రం ఈ చిత్రం విషయంలో అంతకంతకు సస్పెన్స్ గా మారుతూ వస్తుంది.

మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కనీసం ఈ డిసెంబర్ లో అయినా రిలీజ్ అవుతుందేమో చూడాలి.