‘ది ఘోస్ట్’- గ్రాండ్ పబ్లిక్ ఈవెంట్ కి హాజరుకానున్న నాగ చైతన్య, అఖిల్

The Ghost

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్’ ది ఘోస్ట్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 25న కర్నూలులోని ఎస్టీబిసి గ్రౌండ్‌లో గ్రాండ్ గా జరగనుంది. ఓపెన్ గ్రౌండ్ లో జరగబోతున్న ఈ పబ్లిక్ ఈవెంట్ కి ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. టీమ్ మొత్తం ఈ వేడుకను ఘనంగా నిర్వహించనుంది. ఈ వేడుకని మరింత ప్రత్యేకంగా చేయడానికి నాగ చైతన్య, అఖిల్ ఈ గ్రాండ్ ఈవెంట్ కి హాజరుకానున్నారు. చాలా కాలం తర్వాత స్టార్ తండ్రీ కొడుకులు కలిసి సినిమా వేడుకకి రావడం అక్కినేని అభిమానులకు కన్నుల పండుగ కానుంది.

‘ది ఘోస్ట్’ టీమ్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లతో అలరిస్తోంది. నిన్న నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇంటెన్స్ ట్రైనింగ్ చూపించే వీడియో- గన్స్, స్వోర్డ్స్‌ని విడుదల చేసారు.

నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.

భరత్‌, సౌరబ్‌ ద్వయం ఈ సినిమా పాటలని స్కోర్ చేస్తున్నారు. ముఖేష్ జి సినిమాటోగ్రఫర్ గా, బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్‌లు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.

తారాగణం: నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు

సాంకేతిక విభాగం :

దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు

నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మారర్

బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్

సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి.

సంగీతం: మార్క్ కె రాబిన్, ((పాటలు భరత్ – సౌరబ్)

యాక్షన్: దినేష్ సుబ్బరాయన్, కేచ్

ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేశ్వరరావు చల్లగుళ్ల

పీఆర్వో : వంశీ-శేఖర్, బీఏ రాజు