‘అఖండ’కు అంత తొందరేమీ లేదట

Akhanda Will Release After Third Wave
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో ‘అఖండ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టైటిల్ టీజర్ బ్రహ్మాండమైన రెస్పాన్స్ తెచ్చుకుంది.  చిత్రంపై అభిమానుల్లో భారీ హోప్స్ నెలకొని ఉన్నాయి.  బోయపాటి మరోసారి ‘సింహ, లెజెండ్’ లాంటి సీన్ రిపీట్ చేస్తారని ఆశిస్తున్నారు.  సినిమా నుండి వస్తున్న ఫీడింగ్స్ చూస్తుంటే ఔట్ ఫుట్ గట్టిగానే ఉండేలా కనిపిస్తోంది.  ఈపాటికే పూర్తవ్వాల్సిన సినిమా లాక్ డౌన్ మూలంగా నిలిచిపోయింది. ఆఖరి షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. 
 
దీని కోసం లొకేషన్స్ వెతుకుతున్నారు.  ఒక సాంగ్, క్లైమాక్స్, కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉంది.  అది పూర్తయితే పోస్ట్ ప్రొడక్షన్ మొదలైపోతుంది.  మరి రిలీజ్ ఎప్పుడు అంటే అంతా బాగున్నప్పుడే అంటున్నారు బోయపాటి శ్రీను.  ఈ సినిమా మీద బడ్జెట్ గట్టిగానే వెచ్చిస్తున్నారు.  ఇప్పటికే ప్రమోషన్ల మీద బాగా ఖర్చు చేశారు.  బాలకృష్ణ సినిమాలు హిట్ అయితే వసూళ్లు భారీగా ఉంటాయి.  ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని నమ్ముతున్నారు టీమ్.  అందుకే కరోనా ఉధృతి తగ్గిపోయి, సినిమా హాళ్లు తెరుచుకున్న తరవాత భారీ ఎత్తున విడుదలచేయాలని డిసైడ్ అయ్యారు.  అంటే త్వరలో వస్తుందని చెబుతున్న కరోనా థర్డ్ వేవ్ సంగతి ఏంటో తెలాక ‘అఖండ’ విడుదల మీద ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. 

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles