Akhanda: సర్ప్రైజింగ్ గా ఒక్క రోజులో బ్రేకీవెన్ కొట్టేసిన బాలయ్య.!

 

టోటల్ మాస్ ఆడియెన్స్ మరియు నందమూరి అభిమానులు ఎంతో కాలం నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన భారీ మాస్ ఎంటర్టైనర్ “అఖండ”. నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ అలాగే బోయపాటి శ్రీనులా కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ఇది. ఆ హైప్ ని అలా నిలుపుకునే అదిరే ఓపెనింగ్స్ ఈ చిత్రం అందుకుంది.

అయితే ఇక్కడే ఆసక్తికర అంశం ఏమిటంటే ఒక ఏరియాలో మాత్రం బాలయ్య వేరే లెవెల్ మాస్ చూపించాడు. ఓవర్సీస్ మార్కెట్ లో ఎంతో కీలకం అయినటువంటి యూఎస్ లో కేవలం ఒక్కటంటే ఒకే రోజులో బ్రేకీవెన్ కొట్టేసి బాలయ్య ఆశ్చర్యపరిచాడు.

ఈ విధంగా బాలయ్య గత ఏ సినిమాలకి జరగలేదు. అలాగే మాస్ సినిమాలకి కూడా ఈ మార్క్ చాలా అరుదుగా జరుగుతుంది. హాఫ్ మిలియన్ డాలర్స్ వసూళ్లతో బాలయ్య ఈ సర్ప్రైజింగ్ ఫీట్ ని అందుకున్నాడట. దీనితో ఈ ఏడాది టాలీవుడ్ లో సినిమాల్లో ఇదే ఫస్ట్ టైం గా నిలిచింది.