Akhanda : “అఖండ” ఇన్ ఓటిటి..రికార్డ్ వ్యూస్ తో దుమ్ము లేపుతుందట ఎంతంటే?

Akhanda : చాలా కాలం తర్వాత తెలుగు సినిమా దగ్గర ఒక అసలు సిసలైన హిట్ సినిమాగా లేటెస్ట్ బిగ్గెస్ట్ హిట్ “అఖండ” నిలిచింది నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన సాలిడ్ దర్శకుడు బోయపాటి శ్రీను తో చేసిన హ్యాట్రిక్ సినిమా ఇది.

దీనికి ముందు వచ్చిన రెండు సినిమాలు లెజెండ్, సింహా లు ఎలా అయితే చరిత్రలో నిలిచే విధంగా థియేటర్స్ లో ఆడాయో అంతకు మించే విధంగా అఖండ భారీ హిట్ గా నిలిచింది. మరి మొన్ననే థియేటర్స్ లో 50 రోజులు వేడుకలు చేసుకున్న ఈ సినిమా తర్వాత వెంటనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

అయితే ఈ సినిమా ఓటిటిలోకి రావడంతోనే బ్లాస్ట్ తో స్టార్ట్ అయ్యిందట. ఇక అసలు విషయం ఏమిటంటే ఈ చిత్రం హాట్ స్టార్ లో రిలీజ్ అయ్యి 24 గంటలు గడవకుండానే 10 లక్షలకు పైగా రికార్డు వ్యూస్ ను అందుకుందట. ఇది ఓటిటి లో ఏ సినిమా కూడా దక్కని రికార్డ్ వ్యూస్ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

దీనితో ఓటిటి లో కూడా అఖండ దుమ్ము లేపుతుందనే చెప్పాలి. ఇక ఈ సాలిడ్ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్, పూర్ణ మరియు జగపతిబాబు తదితరులు ఈ సినిమాలో నటించారు.