Akhanda : ఐఎండీబీ లో “అఖండ” సెన్సేషన్.. ఇండియాలోనే బెస్ట్ గా.!

Akhanda :  నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన హ్యాట్రిక్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కించిన లేటెస్ట్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా “అఖండ” సినిమా టైటిల్ కి తగ్గట్టుగానే బాక్సాఫీస్ దగ్గర అఖండ మైన విజయాన్నే సొంతం చేసుకుంది. మొదటి రోజు నుంచి కూడా ఈరోజు వరకు అఖండ కి అదే ఆదరణ లభిస్తుంది అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నారు.

మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం విజయం కేవలం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియా మొత్తంలో బెస్ట్ గా ఆడియెన్స్ నిలిపారు. ప్రఖ్యాత అంతర్జాతీయ సినిమా డేటా బేస్(ఐఎండిబి) లో అఖండ సినిమాని ఈ ఏడాది 2021కి గాను ది బెస్ట్ ఇండియన్ సినిమాగా ప్రేక్షకులు 23 శాతం రేటింగ్ తో నిలిపారు.

దీని బట్టి అఖండ సినిమా ఆడియెన్స్ ఏ రేంజ్ లో నచ్చేసిందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. అలాగే ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బాలయ్య కెరీర్ లో అధిక బడ్జెట్ తో మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మాణం వహించారు.