Akhanda : బాలయ్య బాబు ‘పోటీ’ పాట్లు.. కామెడీ కాదు సీరియస్.!

Akhanda : హిందూ మతాన్ని ‘అఖండ’ సినిమాతో ఉద్ధరించేశానంటున్నాడు బాలయ్య. అదేంటో ఆయన ఏం చెప్పినా అలాగే వుంటుంది.  కరోనా టైమ్‌లో వచ్చి ‘అఖండ’ సినిమా బాలయ్య బాబు ఫ్యాన్స్‌కి ఫుల్ ఖుషీనే ఇచ్చిందనుకోండి నో డౌట్ అందులో.

అయితే, నిజంగానే ‘అఖండ’ సినిమాతో హిందూ మతోధ్ధారణ జరిగిందా.? అలాంటి పెద్ద పెద్ద మాటలు మమ్మల్ని అడిగితే మేమేం చెప్పగలం. అది బాలయ్య బాబుకు మాత్రమే చెల్లిందంటారా.? అయితే ఓకే.!

 ఇక, ఇండస్ట్రీలో పోటీ గురించి కాసేపు సరదాగా మాట్లాడుకుందాం. అగ్ర హీరోలుగా చెప్పుకునే మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్.. ఇలా అందరూ పోటా పోటీగా సినిమాలు చేసేస్తున్నారు ప్రస్తుతం. అయితే వీరిలో పోటీ గురించి మాట్లాడుకుంటే ఎలా వుంటుంది.?

ఎవరి పంథాలో వారు సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. బాలయ్య బాబు మాత్రం ‘నాకు నాతోనే పోటీ’ అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్ చెబుతున్నారు కామెడీగా. ఆయన నటించిన ‘సింహా’,  ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ అంటూ ఆయన చెబుతున్నారు.

అయితే, మధ్యలో బాలయ్య నటించిన ఫ్లాప్ సినిమాలు చాలా వచ్చాయ్. ఆ సంగతి ఆయన మర్చిపోయారేమో. అవునులెండి.. వాటిని కూడా కష్టపడి 50 రోజులు, 100 రోజులు ఆడించేసిన ఘనత ఆయనది. ‘అఖండ’ సినిమా 100 రోజుల సక్సెస్ మీట్ సందర్భంగా స్టేజ్ మీద బాలయ్య ఈ డైలాగులు చెబుతుంటే,  ఆయన పక్కనున్నవాళ్లే నవ్వుకుంటున్నారు. స్టేజ్ ఎదురుగా వున్నోళ్ల సంగతి ఎలా వుందో. ఇక టీవీల్లో చూసినోళ్లయితే  పడీ పడీ నవ్వుకుంటున్నారు మరి.

అయితే, ఒక్క విషయంలో బాలయ్యను మెచ్చుకుని తీరాల్సిందే. ఇలాంటి ఫంక్షన్లు కొత్త ఉత్సాహాన్నిస్తాయ్ సినీ రంగానికి. నటీనటులు, సాంకేతిక నిపుణులు.. అందరూ కొత్త ఉత్సాహం పొందుతారు.. అదొక్కటి మినహాయిస్తే, బాలయ్య సొంత డబ్బాని తట్టుకోవడం ఎవ్వరికైనా కష్టమే.