Akhanda Movie Business: కరోనా తరువాత థియేటర్లలో సినిమా రిలీజ్ చేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. థియేటర్లకు ప్రజలు వస్తారా..? లేదా..? అని అనుమానాలు నెలకొన్నాయి. ఇలాంటి అనుమానాల మధ్య బాలయ్య బాబు ’ అఖండ‘ మూవీ వచ్చింది. చాలా రోజులు థియేటర్లకు దూరంగా ఉన్న ఆడియన్స్ పెద్ద ఎత్తున థియేటర్లకు క్యూ కట్టారు.
దీంతో అఖండ మాసీవ్ హిట్ సాధించింది. బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మిగతా టాలీవుడ్ సినిమాకు ఓ భరోసాగా నిలిచింది. బాలక్రిష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన అఖండ బాక్సాఫీస్ వద్ద దుమ్మరేపింది. బాలయ్య కెరీర్ లోనే ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది.
బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా కావడంతో ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీగానే ఉండేవి. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో భారీ హైప్ నెలకొంది. బాలయ్య అఘోర పాత్రలో అదరగొట్టాడు. దీంతో ఫ్యాన్స్ సినిమాకు బ్రహ్మ రథం పట్టారు. అఖండ సినిమా 5 వ వారంలో కూడా మంచిగానే వసూళ్లను రాబట్టింది. సినిమా విడుదలైన 8 రోజులకే బ్రేక్ ఇవెన్ అయింది. తరువాత కూడా భారీగానే వసూళ్లను రాబట్టింది. ఏరియాల వారీగా వసూళ్లను చూస్తే…
నైజాం 20.70 కోట్లు, సీడెడ్ 15.91 కోట్లు, గుంటూరు 4.66 కోట్లు, కృష్ణా 3.55 కోట్లు, నెల్లూరు 2.58 కోట్లు, ఉత్తరాంధ్ర 7.06 కోట్లు, ఈస్ట్ 4.09 కోట్లు, వెస్ట్ 4.83 కోట్లు, ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 63.38 కోట్లను రాబట్టింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ కలిపి 11.16 కోట్లు.. ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 74.54 కోట్లును ఈ చిత్రం రాబట్టింది. మొత్తంగా 5 వారాల్లో అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.74.54 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తంగా రూ. 22 కోట్ల లాభాలను రాబట్టింది. దీంతో పాటు శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ వీటికి అదనం